పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే!
Fake Online Payment Apps: పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే! Jan 25, 2022, 07:48 IST Beware Of Fake Payment App: What Is It And Full Details Inside - Sakshi స్పూఫింగ్ అప్లికేషన్లతో లావాదేవీలు ఖాతాలో నగదు జమ కాకుండానే అయినట్టు మెసేజ్‌లు ఆర్థికంగా నష్టపోతున్న రిటైల్ ఓనర్లు సౌండ్ బాక్స్ ఏర్పాటుతోనే సమస్యకు పరిష్కారం ‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్‌లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్‌లతో టోపీ పెడుతున్...