Posts

Showing posts from August, 2022

రాష్ట్రానికి కరెంటు షాక్‌!

 Published: Fri, 19 Aug 2022 02:34:22 ISTహోంఆంధ్రప్రదేశ్రా  రాష్ట్రానికి కరెంటు షాక్‌! మార్కెట్లో కొనకుండా నిషేధం విధించిన కేంద్రం బకాయిలు చెల్లించని పర్యవసానం..  ఆంధ్ర సహా 13 రాష్ట్రాల డిస్కమ్‌లకు నోటీసులు వాటి మొత్తం బకాయిలు 17,060 కోట్లు..  ఇందులో మన వాటా 412 కోట్లు రాష్ట్రంలో 209 మి.యూనిట్లకు చేరుకున్న డిమాండ్‌..  అందుబాటులో 190 మి.యూనిట్లే ఈ లోటు పూడ్చాలంటే ఎక్సేఛంజీలో కొనాల్సిందే..  లేదంటే కష్టాలు, కోతలే! ఆ సమస్య ఉండదంటున్న అధికారులు..  ఈ నెల 5వ తేదీన తొలి వాయిదా బాకీ కట్టాం ఆ లెక్కలు అప్‌డేట్‌ కాలేదు..  ఒకట్రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని ధీమా కేంద్రం కాదంటే ఉక్కపోత ఖాయం రాష్ట్రాలకు సొంత కరెంటు ఉంటే సరి. లేదంటే...  కరెంటు కష్టాలు కమ్మేస్తాయి. చీకట్లు చుట్టుముడతాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం ‘షాక్‌’ ఇచ్చింది. కరెంటు కొనుగోళ్ల బకాయిలు చెల్లించడంలేదంటూ... బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లకు బ్రేకులు వేసింది. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కరెంటు కొనుగోళ్ల బకాయిలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సకాలంలో తీర్చక పోవడంతో బహిరంగ మార్కెట్లో కరెంటు

అమృతకాలంలో ఆర్థిక నైరాశ్యం...!

 అమృతకాలంలో ఆర్థిక నైరాశ్యం...! Fri, 19 Aug 2022  ‘అంతరంగం అట్టడుగున అందరమూ మానవులమే’– నిజమే. అయితే, అన్ని ఆనందాలూ ఆర్థిక భద్రతతోనే ముడివడి ఉన్నాయని విశ్వసించడంలో మనమందరమూ మరింత పరిపూర్ణ మనుషులం కదా. తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన ఒక ప్రజాభిప్రాయ సేకరణ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మూడు సందేశాలను ఇచ్చింది. అవి: ఆర్థిక అవస్థలను తొలగించాలి, ఆర్థిక అవస్థలను తొలగించాలి, ఆర్థిక అవస్థలను తొలగించాలి. అమృత కాల్ గురించి చేసిన ఘోషల కంటే ఈ సందేశాలు పాలక పక్షానికి మరింత బిగ్గరగా ప్రమాద ఘంటికలు మోగించాయి. ప్రతిపక్షం విషయానికి వస్తే అవి దానికి ఒక అవకాశాన్ని కల్పించడంతో పాటు, ప్రజల పట్ల నిర్వర్తించాల్సిన ఒక బాధ్యతను కూడా గుర్తు చేశాయి. ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ ‘ఇండియా టుడే’ చాలా సంవత్సరాలుగా ‘జాతి మనస్థితి సర్వే’ (మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే)లను నిర్వహిస్తోంది. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవి ప్రామాణికమైనవిగా అందరి మన్ననలు పొందుతున్నాయి. తాజా సర్వే ప్రకారం 2022 జూలై 15–31 తేదీల మధ్య సార్వత్రక ఎన్నికలు నిర్వహించినట్టయితే బీజేపీకి 283 (2019లో 303 సీట్లు సాధించుకున్నది) సీట్లు, ఎన్‌డిఏ 3

అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు

 అప్పు పథంలో  ఐదు రాష్ట్రాలు Aug 18, 2022, 04:20 IST states with highest debt in india - Sakshi రుణభారంలో పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ టాప్‌ పంజాబ్‌ అప్పులు జీఎస్‌డీపీలో 49.5 శాతం.. ఏపీలో 32.5 శాతం మాత్రమే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను రచ్చకీడుస్తూ.. శ్రీలంకతో పోలుస్తూ పదేపదే బురద చల్లుతున్న దుష్ట చతుష్టయానికి చెంపపెట్టులా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించింది. లాక్‌డౌన్‌ తదనంతరం దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులను ప్రపంచ బ్యాంకు క్షుణ్నంగా పరిశోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదిక నిగ్గు తేల్చింది. కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2020–21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై ప్రభావం పడటమే కాకుండా అప్పులు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ అనంతరం పుంజ

అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి

 అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి Aug 18, 2022, 03:25 IST YSRCP intervention petition Supreme Court regarding freebies - Sakshi సుప్రీంకోర్టులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంటర్‌వెన్షన్‌ పిటిషన్‌ ఉచితాలపై మా వాదన కూడా వినండంటూ దాఖలు వైద్యం, విద్యలో అందరికీ అందించటం ప్రభుత్వ బాధ్యత గ్రామీణ, పట్టణ తారతమ్యాలు తొలగించటం ప్రాథమిక విధి ఇలాంటి లక్ష్యాల కోసం అవసరాన్ని బట్టి నిధులను ఖర్చు చేస్తారు లక్ష్యాలను, ఫలితాలను పట్టించుకోకుండా అన్నిటినీ ఉచితాలంటే ఎలా? ఇది రాజ్యాంగం స్ఫూర్తిని అవమానించటం కాదా? ఎన్నికల ముందు ఓట్ల కోసం పథకాలు తెచ్చి పంచిన పార్టీలున్నాయి అలాంటి వాటిపై చర్యలు తీసుకోవచ్చు... అందరినీ ఒకే గాటన కడితే ఎలా? స్కూళ్లలో పిల్లల చేరికలు గణనీయంగా పడిపోయాయి కనుకే.. అమ్మఒడి స్వయం సహాయక బృందాలు ఎన్‌పీయేలయ్యాయి కాబట్టే... ఆసరా విద్యావ్యవస్థ కునారిల్లిపోయింది కాబట్టే ఖర్చుకు వెరవకుండా.. నాడు–నేడు రైతులు పేదరికం, రుణభారంతో అల్లాడుతున్నారనే రైతు భరోసా తెచ్చాం సాక్షి, అమరావతి: అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్‌

Who got the fruits of progress - Sakshi

  ప్రగతి ఫలాలు దక్కిందెవరికి? Aug 18, 2022, 00:27 IST భారత స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్‌ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు గానీ, అది మొత్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దోపిడీ, పీడనలన్నీ రద్దు కావాలని ఆకాంక్షించిన ఉద్యమం. బ్రిటిష్‌ పాలన తొలగిపోయినంత మాత్రాన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టేనా? ఇంతకూ 1947 ఆగస్ట్‌ 15న బ్రిటిష్‌ పాలన తొలగిపోయిందా అనే ప్రశ్నలు 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాసంగికంగా ఉన్నాయి. ఏ అభివృద్ధిని ఆశించి వలస పాలకులను వెళ్లగొట్టామో, ఆ అభివృద్ధి సాధించామా, సాధించినట్టు కనబడుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు కోల్పోయారు?   వలస వాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు దాదాపు నూట యాభై ఏళ్ళు సాగించిన మహోజ్జ్వల పోరాటాల ధారలో ఒక మజిలీ 1947 ఆగస్ట్‌ 15. ఆ విస్తృత పోరాట సంప్రదాయం ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క ప్రజా సమూహానిదో, ఏ ఒక్క నినాదానిదో, ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క ఆశయానిదో కాదు. అది ఈ దేశ ప్రజలందరూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కావాలనే విశాల ఆశయానిది! పద్ధెనిమిదో శతాబ్ది చివరి నుంచే ఆదివాసులు ప్రారంభించిన బ్రిట

ఉచితాలపై దాడితో సంక్షేమానికి ఎసరు!

 Published: Tue, 09 Aug 2022  ఉచితాలపై దాడితో సంక్షేమానికి ఎసరు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఒక జాతీయ రహదారిని ప్రారంభిస్తూ దేశాభివృద్ధికి ఇలాంటి రహదారులు, రవాణా సౌకర్యాలు దోహదపడతాయని, ఉచితాలు–తాయిలాలు వంటి పథకాలు అభివృద్ధికి అడ్డంకి అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కొంతకాలంగా మీడియాలో చర్చ నడుస్తున్నది. కార్పొరేట్ల శ్రేయోభిలాషులైన ఆర్థికశాస్త్రవేత్తలు సంక్షేమ కార్యక్రమాలను పునః సమీక్షించాలని, రాజకీయ పార్టీలు తమ ఇష్టారీతిగా ఉచితాలను ప్రకటించి అమలుచేస్తే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని అంటున్నారు. శ్రీలంక లాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చని హెచ్చరించారు. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఉచితాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) వేశారు. ఏ కారణం వల్లో ఈ పిల్‌ను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుని, దీనిపై ఎన్నికల కమిషన్‌ ఏదైనా చర్య తీసుకోవాలని సూచించింది. ఎన్నికల కమిషన్‌ స్పందిస్తూ– ఇది రాజకీయ పార్టీలు నిర్ణయించవలసిన అంశమని, ఇది తమ పరిధిలోకి రాదని కొంత తెలివిగా, కొంత జాగ్రత్తగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని గురించి ఎవరైనా చొ