Social Media Business: 30 సెకన్ల మాయాబజార్
Social Media Business: 30 సెకన్ల మాయాబజార్ ABN , Publish Date - Apr 21 , 2025 | 03:21 AM సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి రీల్స్, షార్ట్స్‌తో సోషల్ మీడియా ద్వారా వ్యాపారం.. జోరుగా బిజినెస్ ఆన్‌లైన్ వ్యాపారుల్లో గృహిణులే అధికం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత ఒక్క వీడియో హిట్ అయినా కాసుల మోతే.. కాస్త తేడా జరిగితే సర్వం పాయే! అలేఖ్య చిట్టి పికిల్స్.. ఈ మధ్య సోషల్ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం ఇది. పెద్ద ఎత్తున పచ్చళ్ల వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తాము చేసిన ఒకేఒక్క తప్పు బయటపడడంతో ఊహించనంతగా నష్టపోయారు. నెలల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోవడమేకాక.. విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురై నానా అవస్థలు పడ్డారు. ఈ అక్కాచెల్లెళ్ల ఉదంతం వారికే కాదు.. అపరిమిత అవకాశాలు ఉన్న సోషల్ మీడియాను నమ్ముకుని వ్యాపారాలు చేసే వారందరికీ ఓ గుణపాఠం. చిన్న తప్పు చ...