Creative destruction - Nobel Prize
'Creative destruction' - Nobel Prize : సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది ABN , Publish Date - Oct 14 , 2025 | 03:53 AM ఆర్థికశాస్త్రంలో కీలక అంశమైన ‘సృజనాత్మక విధ్వంసం’ ను వివరించి, తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకుగాను...... Nobel Prize : సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియొన్, పీటర్ హోవిట్‌లకు ఆర్థికశాస్త్రం నోబెల్ స్టాక్‌హోం, అక్టోబరు 13: ఆర్థికశాస్త్రంలో కీలక అంశమైన ‘సృజనాత్మక విధ్వంసం’ ను వివరించి, తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకుగాను అమెరికాకు చెందిన జోయల్ మోకిర్, పీటర్ హోవిట్, బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ అఘియొన్ ఈ ఏడాది ఆర్థికశాస్త్రం నోబెల్ బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సోమవారం ఒక ప్రకటన చేసింది. ప్రయోజనకరమైన వినూత్న టెక్నాలజీలు పాత టెక్నాలజీలను, వ్యాపార నమూనాలను ధ్వంసం చేసి కొత్త వాటికి దారి వేస్తాయి అని చెప్పేదే సృజనాత్మక విధ్వంసం సిద్ధాంతం. 1942లో జోసెఫ్ స్కంపీటర్ అనే ఆర్థికవేత్త ‘పెట్టుబడిదారీ విధానం, సమసమాజం, ప్రజాస్వామ్యం’ అనే పుస్తకం ద్వారా ఈ సిద్ధాంతాన్...