గయానా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కానుందా...

గయానా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కానుందా....
సైమన్ మేబిన్
అసైన్‌మెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్
9 మే 2019

గయానా రాజధాని జార్జ్ టౌన్ సమీపంలోని కేమాన్ ఐలాండ్స్‌లోని గ్రాండ్ కేమాన్ సెవెన్ మైల్ బీచ్‌లో సూర్యాస్తమయం

దక్షిణ అమెరికాలోని అత్యంత పేద దేశాల్లో రెండో స్థానంలో ఉన్న గయానాకు చమురు వరంగా మారనుంది. అదే జరిగితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి సమూలంగా మారిపోతుంది. ఆ దేశం దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ధనిక దేశంగా మారిపోతుంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

''2020 నాటికి జీడీపీ 300 శాతం నుంచి 1000 శాతానికి పెరగొచ్చు. అప్పుడు ప్రపంచంలోనే గయానా అత్యంత ధనిక దేశం కావొచ్చు. ఇది ఎంత పెద్ద విషయమో చాలామంది ఇప్పటికీ అర్థం చేసుకోలేరు'' అని 2018 నవంబరులో గయానా రాజధాని జార్జిటౌన్‌లో అమెరికా రాయబారి పెర్రీ హాలోవే అన్నారు.

7 లక్షల 50 వేల జనాభా ఉన్న గయానాలో తలసరి సంపద భారీగా పెరగబోతోందని చెబితే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ, ఆ దేశంలోని ప్రధాన మొబైల్ ఆపరేటర్ అయిన ఎక్సాన్ మొబి.. ఆ దేశ సముద్ర జలాల దిగువన 550 కోట్ల బారళ్ల మేర చమురు నిక్షేపాలున్నాయని గుర్తించిన విషయం గుర్తుచేసుకోవాలి.

గయానాలో నిరుద్యోగం, పేదరికం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చమురు నిక్షేపాలు గుర్తించడం ఆ దేశానికి లాభిస్తుందా లేదా అన్న చర్చా ఉంది. పలు వర్ధమాన దేశాల్లో భారీగా చమురు నిక్షేపాలను గుర్తించి వెలికి తీసిన తరువాత ఆ దేశాల్లో ప్రజల స్థితిగతులేమీ పెద్దగా మారలేదు. అప్పటికే ఉన్న అవినీతి మరింత పెరిగి కొత్త చమురు సంపదను దుర్వినియోగం చేయడం, దోచుకోవడం వంటి పరిణామాలకు దారితీసిన పరిస్థితులున్నాయి. దీన్నే ప్రపంచం ఇప్పుడు చమురు శాపం అంటోంది.

Fact Check: ముస్లింలు ఓటు వేయకుండా పోలీసులు లాఠీచార్జి చేశారనే ప్రచారంలో నిజమెంత...
ఇరాన్ అణు ఒప్పందం: ట్రంప్ తాజా ఆంక్షలు... లోహ ఉత్పత్తులపై అదనపు సుంకాలు
చిత్రం శీర్షిక
గయానాలో కనుగొన్న భారీ చమురు నిల్వలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవనాన్ని మారుస్తుందని భావిస్తున్నారు
గయానా విషయానికొస్తే అక్కడ అవినీతి ఇష్టారాజ్యం. అందుకే ఈ కొత్త చమురు నిక్షేపాలు అవినీతిని మరింత పెంచుతాయన్న ఆందోనళనలు వ్యక్తమవుతున్నాయక్కడ. 'ఈ చమురు వల్ల దేశంలో అవినీతి ఇంకా పెరిగిపోవచ్చ''ని ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ గయానా చాప్టర్ హెడ్ ట్రాయ్ థామస్ అన్నారు.

ఇటీవల కాలంలో గయానాలో ఏర్పడిన రాజకీ సంక్షోభం ఇలాంటివాటికి ముందస్తు సూచిక కావొచ్చన్న విశ్లేషణలున్నాయి.

గత డిసెంబరులో అక్కడి పాలక సంకీర్ణ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో ఓడిపోయింది. అప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా అవిశ్వాస పరీక్షలో ఓటింగ్‌పై కోర్టుకెళ్లింది ప్రభుత్వం. ఇది అక్కడ తీవ్ర నిరసనలకు దారి తీసింది.

ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.

ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ ఓటమికి కారణాలేంటి... దిల్లీ క్యాపిటల్స్‌కు నెక్స్ట్ ఏంటి...
దైవదూషణ కేసులో మరణశిక్ష తప్పించుకుని పాకిస్తాన్ వదిలివెళ్లిన ఆసియా బీబీ
చిత్రం శీర్షిక
విన్సెంట్ ఆడమ్స్
నిపుణులు అవసరం
''చాలా దేశాలు చమురు సంపదను గుర్తించిన తరువాత అంతకుముందున్న కంటే మరింత దయనీయమైన స్థితికి చేరుకున్నాయి.. ప్రపంచంలో ఇలాంటివి చాలా అనుభవాలున్నాయి'' అంటున్నారు గయానా పర్యావరణ పరిరక్షణ సంస్థ అధిపతి విన్సెంట్ ఆడమ్స్.

ఈ చమురు సంపద, దాని వల్ల కలిగే పరిణామాల నుంచి తప్పించుకోవడానికి చదువొక్కటే సరైన మార్గమని.. దేశానికే విద్యే పెట్టుబడి అని గయానా యూనివర్సిటీలో విద్యాసంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న ఆడమ్స్ అన్నారు.

ప్రస్తుతానికి తమ దేశంలో పెట్రోలియం ఇంజినీరింగ్ కోర్సు ప్రయోగశాలలు కూడా లేవని గయానా యూనివర్సిటీలో పెట్రోల్ ఇంజినీరింగ్ విభాగ డీన్ ఎలీనా ట్రిమ్ అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ గయానా ఆయిల్ ఇండస్ట్రీ నుంచి ఈ రంగంలో నిపుణుల కోసం భారీ డిమాండు ఉందని.. ఇతర విభాగాల్లో ఇంజినీరింగ్ చేసినవారిని కూడా తీసుకుని శిక్షణ ఇచ్చుకుంటున్నారని.. గతంలో తమ యూనివర్సిటీ నుంచి 10 మందిని నియమించుకున్న ఓ సంస్థ ఇప్పుడు మరో 20 మంది కావాలని కోరుతోందని.. పెట్రోలియం ఇంజీనిరింగ్ చదివితే చాలు హాట కేకుల్లా ఎగరేసుకుపోతున్నారని ఎలీనా చెప్పారు.

'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్'
సంక్షోభంలో ప్రకృతి: 10 లక్షల జీవుల మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మనిషి
చిత్రం శీర్షిక
జార్జిటౌన్ శివారుల్లోని సోఫియాలో ఉన్న ఓ ఇల్లు
సంపద సమానంగా పంపిణీ అయితేనే ప్రయోజనం
అయితే చమురు నిక్షేపాలతో దేశానికి పెరిగే సంపద ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుందన్న విషయంలో సంశయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు ఉదాహరణలు చూపుతున్నారు విశ్లేషకులు. రాజధాని జార్జిటౌన్ శివారుల్లో ఉండే సోఫియా అనే ప్రాంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడ అతి కొద్ది సంఖ్యలో ఇళ్లకు మాత్రమే విద్యుత్, నీటి సదుపాయం ఉంది.

''జార్జి టౌన్ జనాభాలో 10 శాతం సోఫియాలోనే ఉంటుంది. కానీ, జార్జిటౌన్‌ నుంచి సమకూరే సంపదలో 10 శాతం కూడా ఇక్కడ ఖర్చు చేయడం లేదు'' అని స్థానికంగా యువ కేంద్రం ఒకటి నిర్వహిస్తున్న కొలిన్ మార్క్స్ చెప్పారు.

చమురు వల్ల సమకూరే సంపదను కూడా దేశమంతా ఒకే తరహాలో వినియోగిస్తారన్న నమ్మకం లేదనడానికి ఇలాంటి ఉదాహరణలే ఉంటాయని అన్నారు.

''చమురు సంపదపై ప్రజల్లో సానుకూలత కంటే ప్రతికూల అభిప్రాయాలే ఎక్కువగా ఉన్నాయి. జరుగుతున్న రాజకీయమే దీనికి కారణం. అంతేకాదు.. గినియా, నైజీరియా, పొరుగునే ఉన్న వెనెజ్వెలాల్లో ఏం జరిగిందన్నది చూశారు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో తమకేదో లబ్ధి కలుగుతుందన్న భ్రమల్లో లేరు'' అని కొలిన్ చెప్పారు.

Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?