2 వేల మంది కుబేరుల చేతిలో 460 కోట్ల మంది సంపద

2 వేల మంది కుబేరుల చేతిలో 460 కోట్ల మంది సంపద
* ఆక్స్‌ఫామ్‌ తాజా అధ్యయనంలో వెల్లడి
* భారత్‌లోనూ ధనవంతుల వద్ద భారీగా పోగుపడ్డ సంపద
ప్రపంచంలోని 460 కోట్ల మంది నిరుపేదలకు చెందిన సంపద దాదాపు 2 వేల మంది శతకోటీశ్వరుల చేతుల్లో చిక్కుకున్నదని ఆక్స్‌ఫామ్‌ యూని వర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో త్వరలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయన నివేదికను సోమవారం ఇక్కడ విడుదల చేసింది. 'టైమ్‌ టు కేర్‌' పేరుతో విడుదలయిన ఈ నివేదిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న స్త్రీ-పురుష, పేద-ధనిక విభేదాలను ప్రధానంగా ఎత్తి చూపింది. సంపన్నులైన పురుషులు అందలాలెక్కుతున్న ఈ వ్యవస్థలో పని, పనికి తగిన వేతనం లభించక అనేక మంది మహిళలు, యువతులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటు న్నారని ఈ నివేదిక వెల్లడించింది. వీరికి అందని వేతనాల విలువ ప్రపంచవ్యాప్తంగా ఏటా 10.8 లక్షల కోట్ల డాలర్లకు పైగా వుంటుందని, ఇది టెక్నాలజీ పరిశ్రమ విలువకు మూడు రెట్లు అధికమని ఈ నివేదిక వివరించింది. ఇప్పటికీ అధికశాతం ఆర్థిక ప్రయోజ నాలు సంపన్నులకు, అధికశాతం మంది పురుషులకే దక్కుతున్నాయని, అన్యాయమైన ఈ వ్యవస్థలో నిరుపేద మహిళలు, యువతులు వెనుకబాటులో వుండగా సంపన్న వర్గం పెరిగిపోతోందని అధ్యయన కర్తలు తమ నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ఈ అసమానతలకు ఉదాహరణంగా భారత్‌లోని బీహార్‌ రాష్ట్రానికి చెందిన బుచుదేవి అనే మహిళ ఉదంతాన్ని వీరు తమ నివేదికలో వివరించారు. ఈ రోజుకు 16-17 గంటల పాటు పనిచేస్తూ అతి తక్కువ వేతనం అందుకుంటున్నదని వివరించారు. ఒకవైపు శతకోటీశ్వరులు తమ సొంత విమానాలలో దావోస్‌లో భేటీ అవుతుండగా, మరో వైపు బుచు దేవి వంటి అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా వివక్షా పూరిత జీవితాలను గడుపుతున్నారని ఈ నివేదిక తెలిపింది. ఇప్పటికైనా ఈ శతకోటీశ్వరుల యుగానికి తెరపడి ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం వుందని అధ్యయన కర్తలు ఈ నివేదికలో స్పష్టం చేశారు.
భారత్‌లో 63 మంది కోటీశ్వరుల వద్ద
95 కోట్ల మంది సంపద కన్నా నాలుగు రెట్ల అధికం
భారత్‌లో కోటీశ్వరులు మరింత సంపదను పోగేసుకు న్నారడానికి ఈ నివేదిక నిదర్శనం. భారత్‌లోని ఒక శాతం శతకోటీశ్వరులు...దేశ జనాభాలోని 95.3కోట్ల మంది వద్ద ఉన్న సంపద కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. మొత్తం 63 మంది శతకోటీశ్వరుల సంపద కలిపితే 2018-19 వార్షిక బడ్జెట్‌ రూ.24,42,200 కోట్ల కన్నా అధికమంటే ఆశ్చర్యం కలగకమా నదు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఇఎఫ్‌) 50వ వార్షికోత్సవ సదస్పు సందర్భంగా 'టైం టు కేర్‌' పేరుతో చేసిన ఆక్స్‌పామ్‌ సిద్ధం చేసిన అధ్యయనం ఈ వివరాలను సోమవారం వెల్లడించింది. దేశవ్యా ప్తంగా ఉన్న 2,153 మంది కోటీశ్వరులు, ప్రపంచ జనాభాలో 60 శాతంగా ఉన్న 460 కోట్ల ప్రజల వద్ద కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. ఇంకా ఈ నివేదికలో మరిన్ని విస్తు గొల్పే అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచ అసమానతలు పెరిగినట్లు వెల్లడించింది.
దశాబ్దంలో రెట్టింపు అయిన సంపన్నులు
ఈ నివేదిక ప్రకారం గత ఏడాది కోటీశ్వరుల ఆదాయం క్షీణించినప్పటికీ, గత దశాబ్ద కాలంలో వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని పేర్కొంది. వినాశకర విధానాలకు, అసమాన తలకు అడ్డుకట్ట వేస్తేనే ధనిక-పేద మధ్య అంతరాన్ని చేధించగలమని, ఇందుకు కొన్ని ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఆక్స్‌ఫాం భారత సిఇఒ అమితాబ్‌ బెహర్‌ తెలిపారు. సోమవారం నుండి ఐదురోజుల పాటు జరిగే డబ్ల్యుఇఎఫ్‌ సదస్సులో లింగ సమానత్వం, ఆదా యంపై ప్రధానంగా చర్చలు సాగుతాయని వెల్లడించారు. అసమానతకు సంబంధించిన ఆందోళలు ప్రతీ దేశంలోనూ సామాజిక అశాంతిని కలిగిస్తున్నాయని, ఈ అశాంతికి అవినీతి, రాజ్యాంగ ధిక్కరణలు, నిత్యావసరాల వస్తువులు, సేవల ధరల పెరుగుదల ప్రధాన కారణం కావచ్చునని ఆక్స్‌ఫామ్‌ నివేదిక పేర్కొంది.

Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?