2022 వరకు భౌతిక దూరమే: శాస్త్రవేత్తలు
2022 వరకు భౌతిక దూరమే: శాస్త్రవేత్తలు
లండన్, ఏప్రిల్ 15: కరోనా వైరస్ ప్రభావం మరో రెండేళ్ల వరకు ఉంటుందని, 2022 వరకూ భౌతిక దూరం పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు సూచించారు. లాక్‌డౌన్ ఒక్కసారి అమలు చేస్తే వైరస్ అదుపులోకి రాదని, ఆంక్షలు పాటించకుంటే అది మరోసారి మరింత భయంకరంగా విజృంభిస్తుందని హెచ్చరించారు. వేసవి కాలంలో కొవిడ్-19 వ్యాప్తి తగ్గుతుందన్న అంచనాలు నిజం కావన్నారు. టీకా లేదా సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి రాకుంటే 2025 నాటికి వైరస్ పునరుజ్జీవం చెందుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

Comments
Post a Comment