క్లోరోక్విన్ ఉత్పత్తిలో మనమే కింగ్!
క్లోరోక్విన్ ఉత్పత్తిలో మనమే కింగ్!
అందుకే వెంటపడ్డ అమెరికా, ఇతర దేశాలు
మన కంపెనీలకు భారీ ఆర్డర్లు
గత వారం అమెరికా.. ఈ వారం బ్రెజిల్.. ఇలా పలు దేశాలు ‘‘మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలి.. ఇవ్వండి ప్లీజ్’’ అని భారత్‌ను అభ్యర్థిస్తున్నాయి. మలేరియా నివారణకు వాడే ఈ మందు మన దగ్గరే ఎందుకు ఎక్కువగా ఉంది? అసలు ఈ మందు ఎలా పనిచేస్తుంది? ఇతర దేశాలకు ఇచ్చేసిన తర్వాత కూడా సరిపడే నిల్వలు మనకు ఉన్నాయా? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం..
మలేరియా జ్వరానికి విరుగుడుగా దక్షిణ అమెరికాలో సిన్‌చోనా అనే చెట్టు బెరడును వాడతారు. ఈ బెరడు నుంచి తయారుచేసిన మందే క్వినైన్. 1930ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మలేరియా వచ్చింది. దీనితో ఈ క్వినైన్‌ను కృత్రిమంగా రసాయనపదార్థాలతో తయారుచేయాల్సి వచ్చింది. అలా తయారుచేసిన మందే క్లోరోక్విన్. అయితే ఈ మందు వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో 1950లలో క్లోరోక్విన్‌ను మరింత శుద్ధి చేసి దాని తయారీ విధానంలో మార్పులు చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తయారుచేశారు. ప్రస్తుతం ఈ మందును మలేరియా, కీళ్లనొప్పులు, లూపస్ (ఎస్‌ఎల్‌ఈ)వంటి వ్యాధులకు వాడుతున్నారు. ఈ మందు మన శరీరంలో ప్రవేశించిన వెంటనే మలేరియా పరాన్నజీవి కలిగించే వాపును నివారిస్తుంది. అది ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఈ మందులనే వాడతారు

Comments
Post a Comment