చైనా లో అమెరికా జరిపిన చీకటి వ్యాపారం

చైనా లో అమెరికా జరిపిన చీకటి వ్యాపారం

ఇప్పుడు 'ఊహాన్ డైరీ' అని ఒక అబద్ధపు వార్త చెలామణి అవుతూ చక్కర్లు కొడుతోంది. 'చైనా లో ఏం జరుగుతోంది?' అని చార్లెస్ బెత్లహం అనే ఒక కట్టర్ CIA ఏజెంట్ గతంలో ఇలానే కారుకూతలు కూసాడు. అక్కడ కమ్యూనిజం లేదని పెట్టుబడి ఏరులై పారుతోంది అని మానవ హక్కులు లేవని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అనీ. ఆయన పుస్తకాలను లెఫ్ట్ అల్ట్రా లెఫ్ట్ సర్కిల్ లో బాగా ప్రచారం చేశారు. రంగనాయకమ్మ తో సహా ఆ CIA కూతలను తెగ మెచ్చు కుంది.

ఇవ్వాళ ఊహాన్ డైరీ కూడా చైనా లో అమెరికా జరిపిన చీకటి వ్యాపారం. అదొక పెద్ద కుట్ర. కరోనా ని చైనా కి ముడిపెట్టడం లో ట్రంప్, ఇండియా లో ముస్లిం సమాజాన్ని కుట్ర లో ఇరికించడం లో మోడీ సఫలీకృతులు అవుతున్నారు.

ఇప్పుడు కొత్తగా ఊహాన్ అనే డైరీ తో చైనా సమాజాన్ని బధనాం చేసే పని జరుగుతోంది. అక్కడ జరిగింది కొంచెం అయితే దుష్ప్రచారం మరింత ఎక్కువ అయ్యింది.

రాబోయే రోజుల్లో కరోనా పుణ్యాన బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవబోతున్నాయి. అమెరికా కోలుకునే అవకాశం సుదూర తీరం లో కూడా లేదు త్వరలో వరల్డ్ సూపర్ పవర్ గా చైనా అవతరించ బోనున్నది. అది ఆ దేశ ప్రజల కష్టం దాని పునాదులు గొప్పవి.

మావోయిస్టు లు కూడా కరోనాని సామ్రాజ్య వాదం తో ముడిపెట్టి మాట్లాడే దుస్థితికి చేరారు. ఆ ట్రాప్ లో లెఫ్ట్ కూడా కోరుకొని పోవడం విషాదం. రాబోయే రోజుల్లో తిండి గింజలు దొరకక ఈ భూమి మీద మనిషి మాయం అయే రోజు ఎంతో దూరం లో లేదు .

మనం నెపం కరోనా మీద నెట్టి ఎవ్వతి వె ఎవ్వడు రా అంటూ 'NGO ప్రేరేపిత స్త్రీవాద ఉచ్చులో పడి గట్టు పంచాయితీ లో కూర్చుందాం.

కాగల కార్యం ట్రంప్ నాగపూర్ హెడ్ క్వార్టర్ తీర్చుద్ది...

- డాక్టర్ గుర్రం సీతారాములు (EFL University)

Comments

Popular posts from this blog

2 వేల మంది కుబేరుల చేతిలో 460 కోట్ల మంది సంపద

Invisible hand - Adam Smith

India @3 at 2028 Morgan Stanley