అర్హత ఉన్న ఎంఎ్‌సఎంఈలకే రుణ ఆఫర్లు

అర్హత ఉన్న ఎంఎ్‌సఎంఈలకే రుణ ఆఫర్లు
వడ్డీ రేటు 9.25 శాతం నుంచి 14 శాతం
న్యూఢిల్లీ: ఎంఎ్‌సఎంఈల రుణ అర్హత నిబంధనలను ప్రభుత్వం ఖరా రు చేసింది. రూ.21 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా, ప్రభు త్వం ఎంఎ్‌సఎంఈలకు హామీ లేని రుణాలు ఇచ్చేందుకు రూ.3 లక్షల కోట్ల తో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అత్యవసర పరపతి హామీ పథకం (జీఈసీఎల్‌)గా పిలిచే ఈ పథకం కింద ఈ సంస్థలకు ఇచ్చే రుణాల చెల్లింపుకు, జాతీయ పరపతి హమీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) హామీ ఇస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎ్‌ఫసీ)లకు రూ.25 కోట్ల వరకు రుణాలు ఉన్న ఎంఎ స్‌ఎంఈలు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న ఎంఎ్‌సఎంఈలు ఈ పథకం కింద రుణాలు తీసుకోవచ్చు. ఈ సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలే అర్హత ఉన్న ఎంఎ్‌సఎంఈలకు రుణ ఆఫర్లు పంపిస్తాయి.

ఆసక్తి ఉన్న సంస్థలు ఈ ఆఫర్ల కింద నాలుగేళ్ల కాల పరిమితితో అదనపు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలపై బ్యాంకులైతే 9.25 శాతం, ఎన్‌బీఎ్‌ఫసీలైతే 14 శాతం వడ్డీ వసూలు చేస్తాయి.

మావాళ్లకూ ఇవ్వండి: సీఎఐటీ

ఈ రుణ హామీ పథకాన్ని రిటైల్‌ వ్యాపారులకూ వర్తింప చేయాలని అఖిల భారత రిటైల్‌  వ్యాపార సంఘాల సమాఖ్య (సీఎఐటీ) ప్రభుత్వాన్ని కోరింది. కరోనా లాక్‌డౌన్‌తో రిటైల్‌ వ్యాపారులు ఇప్పటికే రూ.9 లక్షల కోట్లు  నష్టపోయినట్టు తెలిపింది. ప్రభుత్వం ఆదుకోకపోతే వీరిలో 20 శాతం మంది దుకాణాలు మూసుకోక తప్పదని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని  ఎంఎ్‌సఎంఈల కోసం ప్రకటించిన రుణ హామీ పథకాన్ని రిటైల్‌ వ్యాపారులకూ విస్తరించాలని  కోరింది.


Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Economic Survey 2019-20 highlights: Back to Adam Smith's Invisible Hand