Adani group Property
May 28 2021 భారీగా పెరిగిన గౌతమ్ అదానీ సంపద ప్రతి రూ.10వేల పెట్టుబడి.. ఏడాదిలో రూ. 52 వేలకు చేరిక అదానీ లిస్టెడ్ కంపెనీల విలువ పైపైకి ఏడాదిలో 480 శాతం పెరిగిన విలువ అయినా.. అంబానీ కంటే వెనుకంజలోనే? న్యూఢిల్లీ, మే 27: ప్రతి పదివేల రూపాయల పెట్టుబడి.. ఏడాది కాలంలో రూ. 52 వేలకు చేరుకుంది. ఇదీ.. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల దూకుడు తీరు..! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన సంపద గంటకు రూ. 75కోట్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. గత ఏడాది మే నుంచి ఏడాది కాలంలోనే ఆయన భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ సరసన చేరారు. అత్యంత సంపన్న కుటుంబాలైన టాటా, బిర్లా, వాడియా కుటుంబాలతో పోటీ పడుతున్నారు. సూచీ పైపైకి ఇలా.. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలు రెండేళ్లుగా ఇన్‌ఫ్రాపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. ఇందులో గ్యాస్ పంపిణీ, విద్యుత్తు, ఓడరేవులు వంటి రంగాలు ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడుల విలువ ఏడాదిలో కొన్ని రెట్లు పెరిగింది. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో అత్యధికంగా అదానీ టోటల్ గ్యాస్ విలువ 1069% మేర పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో మార్కెట్ విలువను పెంచుకు...