Ambani Adani groups property

 un 14 2021 @ 00:59AMహోంబిజినె

అంబానీ, అదానీ సంపద మరింత పైకి

 చైనా కుబేరులు వెనుకంజ

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ ప్రభావం


న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్‌ ర్యాలీతో కుబేరులు మరింత కుబేరులవుతున్నారు. ‘బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ ప్రకారం ప్రస్తుత ర్యాలీ పుణ్యమాని మన దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీ ఆసియాలోనే అ త్యంత సంపన్నులుగా నిలిచారు. ఇప్పటివరకు ఈ ఇండెక్స్‌లో ఆసియాలోనే అత్యంత సంపన్నులుగా ఉన్న చైనా టెక్‌ దిగ్గజాలు జాక్‌ మా, జాంగ్‌ షన్‌షాన్‌లు అంబానీ, అదానీల తర్వా తి స్థానాలకు పడిపోయారు. గత శుక్రవారం నాటికి  ముకేశ్‌ అంబానీ సంపద విలువ 8,400 కోట్ల డాలర్లు (సుమారు రూ.6.13 లక్షల కోట్లు), గౌతం అదానీ సంపద 7,700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5.62 లక్షల కోట్లు) చేరాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ముకేశ్‌ అంబానీ సంపద 762 కోట్ల డాలర్లు, అదానీ సంపద 4,300 కోట్ల డాలర్లు పెరిగాయి. ప్రస్తుతం అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 12, గౌతం అదానీ 14వ స్థానంలో ఉన్నారు. 

Comments

Popular posts from this blog

per capita income of India and Bangladesh

2019 Military World Games

Manmohan Singh awards Jaitley-led GST Council