Welfare and Development
తాత్కాలిక సంక్షేమం ముందు ఓడిపోతున్న సుస్థిరాభివృద్ధి! ABN , Publish Date - May 26 , 2024 | 03:47 AM ‘ఒక పని చేయాలా వద్దా అని ప్రజాజీవనంలో ఉన్నవారికి ఎప్పుడైనా సందేహం వస్తే, మారుమూల ఉన్న అత్యంత పేద, బలహీనమైన వ్యక్తి గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు చేసే పని వల్ల ఆ వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతాడా? అతనికి తన జీవితం మీద పట్టు వస్తుందా? అంటే, అతని సంపాదన శక్తి పెరుగుతుందా? అలా పెరిగేట్లయితే అది అతనికి నిజమైన స్వరాజ్యం. అతడి ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచగలిగినట్లయితే అది నువ్వు చెయ్యదగిన పని. లేకపోతే నిరర్థకమైన పని’ అన్న సందేశంతో గాంధీజీ ఒక మంత్రం లాంటి ప్రమాణాన్ని నిర్దేశించారు. కానీ మనం ‘ఎలాగోలా అధికారమే పరమావధి’ మంత్రంగా మారిన రాజకీయంలో ఉన్నాం. మన అపరిపక్వ ప్రజాస్వామ్యానికి గాంధీజీ మంత్రం చాలా కఠినమైన, అందుకోలేని ప్రమాణంగా తయారైంది. కోట్లాది ప్రజలు పేదలుగా, అవకాశాలు అందనివారుగా ఉన్న సమాజంలో, ఓటర్లు ఎన్నికలలో సరికొత్త తాత్కాలిక పథకాలను ఆశించటాన్ని తప్పు పట్టలేం. వ్యక్తిగత తాత్కాలిక సంక్షేమ పథకాల చేతిలో ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక ఉమ్మడి అవసరాలు ఓడిపోవటం మళ్లీ మళ్లీ చూస్తు...