Vulgar World Economics

 ||ఆర్థిక సిద్ధాంతాల మాయాజాలం||


~~~ప్రభాత్‌ పట్నాయక్‌


ఇప్పుడు ”ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం”గా పిలవబడేదంతా సత్యాన్ని వెలికి తీసే లక్ష్యంతో కాకుండా దానిని మసిపూసి మారేడుకాయ చేసే లక్ష్యంతో నడుస్తోంది. ఆర్థిక శాస్త్రానికి ఉన్న ఈ సైద్ధాంతిక స్వభావాన్ని కార్ల్‌మార్క్స్‌ లోతుగా గ్రహించాడు గనకనే ‘సాంప్రదాయ ఆర్థిక శాస్త్రం’, ‘అసభ్యకర ఆర్థిక శాస్త్రం’ (వల్గర్‌ ఎకనామిక్స్‌) అని రెండు రకాలుగా ఆర్థిక శాస్త్రాన్ని వేరుచేసి చూడాలని చెప్పాడు. 


ఈ రెండో రకపు అర్థశాస్త్రం ఉత్పత్తి ప్రక్రియను పట్టించుకోదు. మారకం మీద మాత్రమే తన దృష్టినంతటినీ పెడుతుంది. ఆ మారకం జరిగే మార్కెట్‌ లో పాల్గొనే ప్రతీ వ్యక్తీ ఒకేస్థాయిలో ఉంటాడు కనుక ఉత్పత్తి రంగంలో జరిగే దోపిడీ సంగతి పూర్తిగా మరుగున పడిపోతుంది.


పెట్టుబడిదారీ విధానంలో అదనపు విలువ ఎలా వస్తుంది అన్న అంశం మీద మార్క్స్‌ ప్రధానంగా తన దృష్టినంతా సారించాడు. కనుక ఆ కోణం నుంచే ఆర్థికశాస్త్రం సైద్ధాంతిక స్వభావాన్ని ఆయన చర్చించాడు. ఐతే, మొత్తం వ్యవస్థను పరిశీలించే విషయంలో ‘ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రం’ సామ్రాజ్య వాదం అనేది ఒకటుందని గుర్తించదు. సామ్రాజ్యవాదాన్ని పట్టించుకోకపోవడం కాదు. అసలు సామ్రాజ్యవాదం అనేది ఉనికిలో ఉన్న వాస్తవాన్ని అది నిరాకరిస్తుంది.


ఇలా అంటున్నానంటే, ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర రంగంలో ఉన్న పండితులందరిలోనూ నిజాయితీ లోపించిందని భావించకూడదు. వారి సిద్ధాంతం సంచరించే పరిధిని దాటడం వారికి సాధ్యం కావడం లేదు. అంతే. బోధనా రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నవారు తమ వృత్తిలో పై స్థానాలకు ఎదగాలంటే, వారి పరిశోధనలు ప్రచురించ బడాలంటే, వారికి అవార్డులు, పదవులు రావాలంటే వారు ‘ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రం’ పరిధిని అతిక్రమించకుండా దానికి లోబడే వ్యవహరించాల్సి వుంటుంది. 


ఆ పరిధిని గనుక అతిక్రమించి ‘సామ్రాజ్యవాదం’ వంటి అంశాలను చర్చించడానికి పూనుకుంటే అందుకు వారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అందుచేత చాలామంది ఆర్థికశాస్త్ర పండితులు ఆ పరిధులకు లోబడే నడుచుకోడానికి నిర్ణయించుకుంటారు. 


ఆ ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ అనేదాని లోనే సామ్రాజ్యవాదం అన్న విషయం కనిపించదు కనుక వారు దాని ఊసు ఎత్తరు. అంతే తప్ప వారంతా నిజాయితీ లేని పండితులు అని, కావాలనే వారంతా అలా వ్యవహరిస్తున్నారని మనం అనుకోవద్దు.


ఒకటి, రెండు ఉదాహరణలతో ఈ విషయాన్ని బాగా గ్రహించవచ్చు.మొదటిది ఆర్థికవృద్ధికి సంబంధించిన సిద్ధాంతం. ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికజనం వృద్ధి చెందే రేటుతో ఆ సమాజపు ఆర్థికవృద్ధిని ముడిపెట్టి చూస్తుంది. అంటే ఆ సమాజంలో జనాభా సహజంగా పెరిగే రేటుతో అది ముడిపడి వుంటుందని భావిస్తుంది.


ఈ దృక్పథంలో ఉన్న లోపం ఏమంటే అది సమాజం మొత్తంగా ఉన్న డిమాండ్‌ తాలూకు పాత్రను అది గుర్తించదు. ఆ దృక్పధం ‘సే’ సూత్రాన్ని విశ్వసిస్తుంది. సమాజంలో ఎంత ఉత్పత్తి అవుతుందో అదంతా చెల్లుబాటు అయిపోతుంది అని ‘సే’ సూత్రం అంటుంది. ఎక్కడైనా సూక్ష్మ స్థాయిలోనో, తాత్కాలికంగానో డిమాండ్‌ కొరత రావచ్చునేమో తప్ప మొత్తం మీద మార్కెట్‌లో ఎంత ఉత్పత్తి వస్తుందో అంత మేరకు సరిపడా డిమాండ్‌ ఉంటుందని ఆ సూత్రం చెప్తుంది. కాని ఇది చారిత్రికంగా చూసినప్పుడు వాస్తవం కాదు.


అమెరికా, కెనడా వంటి ‘కొత్త ప్రపంచపు’ దేశాలలో పెట్టుబడిదారీ విధానం నడవడానికి కావలసిన శ్రామిక జనాన్ని అందించడం కోసం 19 వ శతాబ్దం వరకూ (1900 వరకూ) దాదాపు రెండు కోట్లమంది ప్రజలను ఆఫ్రికా నుండి బానిసలుగా పట్టి తెచ్చి నియోగించారు. వారిచేత గనుల్లో, తోటల్లో పని చేయించారు. 


అదే విధంగా భారతదేశం నుండి,చైనా నుండి దాదాపు 5 కోట్ల మంది శ్రామికులను ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని ఆ కొత్త ప్రపంచానికి తరలించారు. ఇది దాదాపు మొదటి ప్రపంచ యుద్ధం దాకా కొనసాగింది (అంతకు ముందే యూరప్‌ నుంచి దాదాపు 5 కోట్ల మంది ప్రజానీకం ఇష్టపూర్వకంగానే కొత్త ప్రపంచానికి వలసలు వచ్చారు. ఆ కొత్త ప్రపంచంలో అంతవరకూ జీవిస్తున్న స్థానికులను వారి ఆవాసాల నుండి తరిమివేసి ఆ భూములను ఆక్రమించు కున్నారు).


పెట్టుబడిదారీ విధానం విస్తరణ క్రమంలో ఇంత భారీ స్థాయిలో జనాభా ఒక దగ్గరి నుండి మరొక చోటికి తరలించబడడం అనేది ‘ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం’ చెప్పే వృద్ధి సిద్ధాంతానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. జనాభా సహజ వృద్ధి మీద ఆధారపడి ఆర్థిక వృద్ధి జరుగుతుందనే ఆ సిద్ధాంతం ఇక్కడ వర్తించలేదు.ఐనప్పటికీ, వాళ్ళు ఇప్పటికీ అదే వృద్ధి సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు.


ఒకవేళ ‘సామ్రాజ్యవాదం’ అనేది లేకపోయి నట్టైతే ఈ వృద్ధి సిద్ధాంతం చెల్లుతుంది కదా అనే వాదన చేసినవాళ్ళూ ఉన్నారు. ఆస్ట్రియాకు చెందిన ఆట్టో బేయర్‌ అనే మార్క్సిస్టు ఈ విధమైన వాదనలనే చేశాడు. కాని పెట్టుబడిదారీ విధానం తన అవసరాల కోసం సాగించిన భారీ స్థాయి జనాభా తరలింపులను అతను గుర్తించనేలేదు.


”21వ శతాబ్దంలో పెట్టుబడి” అనే గ్రంథాన్ని 2013లో రచించిన థామస్‌ పికెటీ సైతం చారిత్రకంగా ఖండాంతరాలను దాటి జరిగిన శ్రామిక జనుల నిర్బంధ తరలింపును తన సిద్ధాంతంలో పరిగణనలోకి తీసుకోలేదు.


ఇక రెండో ఉదాహరణ స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన సిద్ధాంతం.స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా ప్రతీ దేశమూ ప్రయోజనం పొందుతుంది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ప్రతీ దేశంలోనూ ఉత్పత్తి విధానంలో ఉండే అన్ని అంశాలూ ( పరిశ్రమలు పూర్తి కెపాసిటీ మేరకు నడవడం, ముడిసరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కావడం, కార్మికులు పూర్తి స్థాయిలో పనుల్లో నియోగించబడడం వగైరా) పూర్తి వినియోగంలో ఉంటాయన్నది ఈ సిద్ధాంతానికి ప్రాతిపదిక.


 స్వేచ్ఛా వాణిజ్యానికి అనుమతినిచ్చిన తర్వాత కూడా ఉత్పత్తి విధానంలోని అన్ని అంశాలూ పూర్తి స్థాయిలో వినియోగించ బడుతూనే వుంటాయని, ఐతే,ఏ దేశం ఏ యే ఉత్పత్తులు చేస్తుందనేది మాత్రం మారుతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది. 


ప్రతీ దేశమూ తన వనరులను వినియోగించు కుంటూ మొత్తం ప్రపంచ మార్కెట్‌కు తగినట్టు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని చేపడుతుందని,వివిధ దేశాల మధ్య పరస్పర సహకారం ఏర్పడుతుందని, దాని వలన అన్ని దేశాలూ వృద్ధి చెందుతాయని ఈ సిద్ధాంతం భావిస్తుంది. పరస్పర పోటీలో నిలదొక్కుకో గలిగినవారే మిగులుతారనే పోటీ సిద్ధాంతాన్ని అది తిరస్కరిస్తుంది.


ఐతే ఇలా అన్ని దేశాలూ పూర్తి స్థాయిలో ఉత్పత్తిని చేపట్టగలగాలంటే ఆ ఉత్పత్తిని అంతటినీ పూర్తిగా వినియోగించగలిగే డిమాండ్‌ ఉండి వుండాలి.కాని ప్రపంచం మొత్తం మీద ఎంత డిమాండ్‌ ఉంటుందో అంతమేరకే ఉత్పత్తిని చేపట్టడం జరుగు తుంది కాని అందుకు భిన్నంగా కాదు.ఉన్న డిమాండ్‌కు మించి ఉత్పత్తి చేస్తే ఆ సరుకులు చెల్లుబాటు కాకుండా మిగిలి పోతాయి. అందుచేత ఒకానొక దేశంలో గనుక ఉత్పత్తి పెరిగితే, అది మరొక దేశంలో ఉత్పత్తి తగ్గిపోడానికి దారితీస్తుంది. అంటే స్వేచ్ఛా వాణిజ్యం ఫలితంగా అన్ని దేశాలూ వృద్ధి చెందుతాయనే వాదన చెల్లదు. కొన్ని దేశాలు బాగుపడడానికి మరికొన్ని దేశాల పరిస్థితులు దెబ్బ తినవలసిన పరిస్థితులను స్వేచ్ఛా వాణిజ్యం కల్పిస్తుంది. 


అందుకే వివిధ దేశాల నడుమ మార్కెట్ల మీద పట్టు కోసం పోరాటం జరుగుతూ వుంటుంది. ఇలా మార్కెట్లమీద అదుపు సాధించే లక్ష్యమే సామ్రాజ్యవాదం అనే స్వభావానికి మూలం.వాణిజ్యం అనేది ఒక పోరాటంగా చూడడం బదులు.అది పరస్పర సహకారంతో జరుగుతుందని చెప్పడం ద్వారా ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ సామ్రాజ్యవాదం అనే లక్షణాన్ని పూర్తిగా మరుగుపరుస్తుంది.


పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థించే సిద్ధాంత వేత్త అయినప్పటికీ జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ ఈ మార్కెట్ల కోసం దేశాల నడుమ జరిగే పోరాటాన్ని గుర్తించాడు. అందుకే అతడు ‘సే’ సూత్రాన్ని తిరస్కరించాడు. ఒకానొక దేశం తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే మార్కెట్ల కోసం పోటీ పడవలసిందేనని అతడు తెలిపాడు. అటువంటి పోటీని తట్టుకోవాలంటే దేశీయ మార్కెట్‌ లోని డిమాండ్‌ను బలోపేతం చేయాల్సి వుంటుందని,పూర్తి స్థాయిలో అందరికీ ఉపాధి కల్పించేవిధంగా ప్రభుత్వం జోక్యం కల్పించుకున్నప్పుడే దేశీయ డిమాండ్‌ బలపడుతుందని కీన్స్‌ ప్రతిపాదించాడు. అదే విధంగా దేశీయ మార్కెట్‌ను, ఉత్పత్తిదారులను, అంతర్జాతీయ పోటీ తాకిడి నుండి కాపాడడానికి సైతం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అతను చెప్పాడు. అంటే స్వేచ్ఛా వాణిజ్యం ప్రయోజనకరం అనే సిద్ధాంతాన్ని అతడు తిరస్కరించా డన్నమాట.


కాని ఇప్పటికీ,స్వేచ్ఛా వాణిజ్యం సిద్ధాంతాన్ని చిలక పలుకుల్లా వల్లించేవారు ఉన్నారు. వారంతా మార్కెట్‌ మొత్తం మీద డిమాండ్‌కు ఏర్పడే కొరతను పరిగణనలోకి తీసుకోరు. అందువలన మార్కెట్‌ కోసం అనివార్యంగా తీవ్రమైన పోటీ ఉంటుందనే వాస్తవాన్ని వారు గుర్తించలేక పోతున్నారు. ఆ పోటీ సామ్రాజ్యవాదానికి దారి తీస్తుందని వారు గుర్తించరు.నిజానికి సామ్రాజ్యవాదం అనే ధోరణిని కప్పిపుచ్చడానికే వాళ్ళు స్వేచ్ఛా వాణిజ్యం సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. దానిని సమర్ధించుకోడానికి కాలం చెల్లిన ‘సే’ సూత్రాన్ని జపిస్తున్నారు.


మూడవ ప్రపంచ దేశాలలో పరిశ్రమలను వలస పాలన కాలంలో నాశనం చేయడం, ఆ దేశాలకు తమ పారిశ్రామిక సరుకులను పెద్దఎత్తున దింపి మార్కెట్‌ను చేజిక్కించు కోవడం చారిత్రిక వాస్తవం.కాని,ఈ చారిత్రిక అనుభవాన్ని కూడా స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతకారులు గుర్తించరు. 


అందుచేత మూడవ ప్రపంచ దేశాలలో నెలకొన్న పేదరికానికి మూలం సామ్రాజ్యవాదుల దోపిడీయే అన్న సత్యాన్ని, సంపన్న దేశాలతో వాణిజ్యం నిజానికి మూడవ ప్రపంచ దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే సత్యాన్ని వారు కప్పిపుచ్చే పనిలో ఉన్నారు.


అందుకే ఈ ‘ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రం’ అనేది నిష్పాక్షికమైనదేమీ కాదు.అది సామ్రాజ్యవాద దోపిడీని కప్పిపుచ్చే సైద్ధాంతిక మాయాజాలం.


(స్వేచ్ఛానుసరణ)



Glen Burua Motivation  · Follow

4 days ago

  · 

కోడాక్ కంపెనీ గుర్తుందా? 1997లో కోడాక్ కు సుమారు 160,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

మరియు ప్రపంచంలో 85% ఫోటోగ్రఫీ కోడాక్ కెమెరాలతో జరిగింది. గత కొన్నేళ్లుగా మొబైల్ కెమెరాల పెరగడంతో మార్కెట్ నుంచి కొడాక్ కెమెరా కంపెనీ. కోడాక్ కూడా పూర్తిగా దివాళా తీసింది, అతని ఉద్యోగులందరినీ తొలగించారు.

అదే సమయంలో మరిన్ని ప్రముఖ కంపెనీలు తమను తాము ఆగిపోవాల్సి వచ్చింది. ఇష్టపడండి

HMT (గడియారం)

బజాజ్ (శిక్షర్)

దానోరా (టీవీ)

మర్ఫీ (రేడియో)

నోకియా (మొబైల్)

రాజ్ డూట్ (బైక్)

అంబాసిడర్ (కారు)

పై కంపెనీలలో ఏవీ నాణ్యత చెడ్డవి లేవు. ఈ కంపెనీలు ఇంకా ఎందుకు బయటకు వచ్చాయి? ఎందుకంటే వారు కాలక్రమేణా తమను తాము మార్చుకోలేరు.

ప్రస్తుత క్షణంలో నిలబడి, రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచం ఎంతగా మారగలదో మీరు ఆలోచించరు! ఇంకా నేటి 70%-90% ఉద్యోగాలు వచ్చే 10 సంవత్సరాలలో పూర్తిగా ముగియబోతున్నాయి. మనం నెమ్మదిగా "నాలుగో పారిశ్రామిక విప్లవం" శకం లోకి ప్రవేశి

నేటి ప్రముఖ కంపెనీలను చూడండి-

UBER అనేది కేవలం సాఫ్ట్ వేర్ పేరు. లేదు, వారికి సొంత కార్లు లేవు. ఇంకా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ-ఫైర్ కంపెనీ UBER.

Airbnb నేడు ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీ. కానీ ఫన్నీ విషయం ఏమిటంటే వారు ప్రపంచంలో ఒక్క హోటల్ కూడా స్వంతం కాదు.

అలాగే పేటీఎం, ఓలా క్యాబ్, ఓయో రూమ్స్ మొదలైన లెక్కలేనన్ని కంపెనీలకు ఉదాహరణలు చెప్పొచ్చు.

ఈరోజు అమెరికాలో కొత్త లాయర్లకు పని లేదు, ఎందుకంటే ఐబిఎం వాట్సన్ అనే లీగల్ సాఫ్ట్ వేర్ ఏ కొత్త లాయర్ కంటే మెరుగ్గా వాదించగలదు. అందువల్ల, రాబోయే 10 సంవత్సరాలలో దాదాపు 90% అమెరికన్లకు ఎలాంటి ఉద్యోగాలు ఉండవు. మిగిలిన 10% సేవ్ చేయబడుతుంది. వీరు 10% నిపుణులుగా ఉంటారు.

కొత్త డాక్టర్ కూడా పని చేయడానికి కూర్చున్నాడు. వాట్సన్ సాఫ్ట్ వేర్ మనుషుల కంటే క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను 4 రెట్లు ఖచ్చితంగా గుర్తించగల 2030 నాటికి కంప్యూటర్ ఇంటెలిజెన్స్ మానవ మేధస్సు

రాబోయే 20 ఏళ్లలో నేటి 90% కార్లు రోడ్లపై కనిపించవు. మిగిలిపోయిన కార్లు విద్యుత్ లేదా హైబ్రిడ్ కార్ల ద్వారా నడుపుతాయి. రోడ్లు నెమ్మదిగా ఖాళీ అవుతాయి. గాసోలిన్ వినియోగం తగ్గి చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు నెమ్మదిగా దివాళా

మీకు కారు కావాలంటే ఉబెర్ లాంటి సాఫ్ట్ వేర్ నుండి కారు అడగాలి. మరియు మీరు కారు అడిగిన వెంటనే, పూర్తిగా డ్రైవర్ లేని కారు వచ్చి మీ డోర్ ముందు పార్క్ చేస్తుంది. ఒకే కారులో చాలామందితో ప్రయాణిస్తే కారు అద్దె బైక్ కంటే తక్కువ.

డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య 99% తగ్గుతుంది. అందుకే కార్ ఇన్సూరెన్స్ ఆగిపోతుంది మరియు కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు అవుట్ అవుతాయి.

భూమిపై డ్రైవింగ్ చేయడం వంటివి ఇకపై మనుగడ సాగవు. 90% వాహనాలు రోడ్డు మీద నుండి మాయం అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్, పార్కింగ్ సిబ్బంది అవసరం ఉండదు.

జర ఆలోచించండి 10 సంవత్సరాల క్రితం కూడా వీధుల్లో STD బూత్ లు ఉండేవి. దేశంలో మొబైల్ విప్లవం వచ్చిన తరువాత ఈ STD బూత్ లన్నీ బలవంతంగా మూసివేయబడ్డాయి. బ్రతికున్నోళ్లు మొబైల్ రీఛార్జ్ షాపులు అయ్యారు. మొబైల్ రీఛార్జ్ లో మళ్లీ ఆన్ లైన్ విప్లవం. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో మొబైల్ రీచార్జ్ చేయడం మొదలు పెట్టారు. ఈ రీఛార్జ్ దుకాణాలను మళ్లీ భర్తీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవి షాపులు కొనడానికి, అమ్మడానికి, రిపేర్ చేయడానికి కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే. కానీ ఇది కూడా త్వరలో మారుతుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి నేరుగా పెరుగుతున్న మొబైల్ ఫోన్ అమ్మకాలు.

డబ్బుకు నిర్వచనం కూడా మారుతోంది. క్యాష్ ఉండేది కానీ నేటి కాలంలో అది "ప్లాస్టిక్ మనీ" అయింది. క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు రౌండ్ కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు అది కూడా మారి మొబైల్ వాలెట్ శకం వస్తోంది. పెరుగుతున్న పేటీఎం మార్కెట్ మొబైల్ డబ్బు ఒక్క క్లిక్.

వయసుతో పాటు మారలేని వారిని వయస్సు భూమి నుండి దూరం చేస్తుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మారుతూ ఉండండి.

గొప్ప కంటెంట్ ని సృష్టించడం కొనసాగించండి, సమయంతో పాటు ముందుకు సాగండి.




Oliver William

I will tell the other story. If 90% people lost the jobs and only 10% will survive which are just industrialists, then 90% people start living their back life. I mean no one wants to stay in cities and will go back to their respective places. So in cities, no food business, no public transport will survive, no malls, no theatres and no other entertainment hubs will be there. And most importantly as government forced us to construct houses in cities so the real-estate will fall as no one have jobs, so that banks as no one will take loans. As everyone back to Village with less money, they stop purchasing luxury items and only think about their needs. So only farmers and other basic needs business people will survive. As people don't care about the luxury things, industrialists who can start recruiting artificial intelligence over humans, won't have any customers and either they will shutdown their business or they will start recruiting humans. Man, simple if governments want to run, people should have money to spend

13h

Reply

See translation

Malik Tahir

Oliver William Agreed.

4h

Reply

See translation

Sundar Raj

Oliver William i think by that time every sources to live in our native land will be finished....

50m

Reply

See translation

Anirudhya Chakraborty

Oliver William yup same pinch. If no one will be having money to spend, then the economy will collapse, how will industries keep on running, who will buy their goods.

1h

Reply

See translation


FE Lizarte

So it's time to trust God and His will be done. Let's faithfully serve God.

2d

Reply

See translation

John Hendriks

It’s all in the bible . Read revelation 13 chapter . Follow Jesus and He will show you the way ahead



Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

February 2016: 400 Years Ago the Catholic Church Prohibited Copernicanism