Posts

Showing posts from January, 2026

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అసమానతల భారత్‌

Image
  అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అసమానతల భారత్‌ ABN  , Publish Date - Jan 22 , 2026 | 04:00 AM మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కొన్ని అనివార్య పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తదుపరి వచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని... మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కొన్ని అనివార్య పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తదుపరి వచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని, పేదలకూ సంపన్నులకూ మధ్య పూడ్చలేనంత వ్యత్యాసం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణల వల్ల సృష్టించబడే సంపద అట్టడుగున ఉన్న పేదల వరకూ చేరుతుందనీ, దానిని ‘ట్రికిల్‌ డౌన్‌ ఎఫెక్ట్‌’ అంటారనీ అప్పట్లో కొందరు ఆర్థికవేత్తలు, పాలకులు ఊదరగొట్టారు. అయితే, సంస్కరణల పేరుతో సాగిన ప్రైవేటీకరణ కారణంగా సృష్టించబడిన సంపదలో సింహభాగం పై స్థాయికి చేరింది. నామమాత్రపు భాగం మాత్రమే కిందికి చేరుకుంది. ఫలితంగా, ఆర్థిక అసమానతలు అంతకుముందెన్నడూ లేనంతగా పెరిగిపోయి, నేడు అది భూమ్యాకాశాలకు మధ్య ఉన్నంత అంతరంగా మారిపోయింది. అందుకనే రాజకీయ నాయకులు కొందరు ఒకప్పుడు ఊతపదంలా ఉపయోగించిన ‘ట్రికి...