మన ఆర్థిక పునాదులు గట్టివి - అమిత్‌ షా

మన ఆర్థిక పునాదులు గట్టివి
31-08-2019 01:54:16

7శాతం వృద్ధితో దూసుకుపోతున్నాం: అమిత్‌ షా
గాంధీనగర్‌, ఆగస్టు 30: ఆర్థికమాంద్యం తరుముతున్న వేళ దేశ హోంమంత్రి అమిత్‌ షా -ఆశావహమైన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పునాదులు సుదృఢంగా ఉన్నాయని, ప్రపంచంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందనీ ఆయన గురువారం గాంధీనగర్‌లో ఓ స్నాతకోత్సవంలో అన్నారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినపుడు దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కానీ ఈరోజు- 2019లో మన వృద్ధి రేటు 7 శాతంవైపు పరుగులు తీస్తోంది. స్థూల ఆర్థిక మూలాలు గట్టిగా ఉన్నాయి. . గడచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని 3 శాతం కంటే తక్కువ ఉండేట్లు చర్యలు తీసుకున్నాం.

ద్రవ్యలోటు కూడా 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించగలిగాం’’ అని ఆయన వివరించారు. ఆర్థిక పరిమాణ రీత్యా భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద పురోగామి దేశం కావాలని ప్రధాని మోదీ భావించారని, తదనుగుణంగా సూక్ష్మస్థాయిలో ప్రఽణాళికలు వేసుకుంటూ ముందుకెళ్లామని చెప్పారు. ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు. అటు న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా మోదీ నేతృత్వంలో భారత్‌ ఆర్థిక సూపర్‌ పవర్‌గా ఆవిర్భవిస్తుందని తిరుమలలో అన్నారు.

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith