అపర కుబేరుడు ముఖేష్ అంబానీ

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ

3,80,700 కోట్లు అపర కుబేరుడు అంబానీ సంపద ఇది
26-09-2019 00:57:47

రెండో స్థానంలో హిందూజా
మూడో స్థానంలో అజీమ్‌ ప్రేమ్‌జీ
టాప్‌ 25 మంది కుబేరుల సంపద
జీడీపీలో 10 శాతానికి సమానం
టాప్‌ 100లో ఐదుగురు తెలుగువారు
అరబిందో ఫార్మా రామ్‌ప్రసాద్‌ రెడ్డి,
ఎంఈఐఎల్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి
ఐఐఎ్‌ఫఎల్‌ హురన్‌ రిచ్‌ లిస్ట్‌ వెల్లడి
జాబితాలో 74 మంది తెలుగు వాళ్లు
హురన్‌ రిచ్‌ లిస్ట్‌లో వరుసగా 8వసారి అగ్రస్థానం
953కు పెరిగిన శ్రీమంతులు.. 74 మంది తెలుగు వారికి చోటు


ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్‌ పద్దు మొత్తం విలువ.. రూ.3,74,518 కోట్లు. కానీ.. అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపద విలువ ఎంతో తెలుసా? రూ.3,80,700 కోట్లు!! ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు!!
ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now

తెలుగు పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న కంపెనీల్లో అత్యధికంగా ఫార్మా, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, సిమెంట్‌ రంగ కంపెనీలున్నాయి. వీటితోపాటు మెరైన్‌ పోర్ట్‌, సర్వీసులు, అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫుడ్‌ బేవరేజెస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హెల్త్‌కేర్‌, కెమికల్స్‌, పెట్రోకెమికల్స్‌ కంపెనీలున్నాయి.

ముంబై: దేశంలోని కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. భారత్‌లో వరుసగా ఎనిమిదోసారి ఆయనే నెంబర్‌ వన్‌ సంపన్నుడిగా స్థానం దక్కించుకోవడం విశేషం. ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ పేరుతో విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం ముకేశ్‌ అంబానీ సంపద రూ.3,80,700 కోట్లుగా ఉంది. రూ.1,000 కోట్లకు పైగా నెట్‌వర్త్‌ కలిగిన భారతీయులతో ఐఐఎ్‌ఫఎల్‌ ఈ జాబితాను రూపొందించింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన కంపెనీలను నిర్వహిస్తున్న వారితో పాటు ఇండివిడ్యువల్‌గా వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్న వారితో ఈ జాబితాను తయారు చేసింది. లండన్‌కు చెందిన ఎస్‌పీ హిందూజా అండ్‌ ఫ్యామిలీ రూ.1,86,500 కోట్ల సంపదతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ (రూ.1,17,100 కోట్లు) నిలిచారు.

నాలుగో స్థానంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ చైర్మన్‌, సీఈఓ ఎల్‌ఎన్‌ మిట్టల్‌ (రూ.1,07,300 కోట్లు), ఐదో స్థానంలో గౌతమ్‌ అదానీ (రూ.94,500 కోట్లు), ఆరో స్థానంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సారథి ఉదయ్‌ కోటక్‌ (రూ.94,100 కోట్లు), ఏడో స్థానంలో సైరస్‌ మిస్ర్తీ (రూ.88,800 కోట్లు), ఎనిమిదో స్థానంలో సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ (రూ.76,800 కోట్లు), తొమ్మిదో స్థానంలో షాపూర్జీ పల్లోంజీ (రూ.76,800 కోట్లు), పదో స్థానంలో సన్‌ఫార్మాసూటికల్స్‌ వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వీ (రూ.71,500 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అన్ని రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. టాప్‌ 100లో ఐదుగురు తెలుగు పారిశ్రామికవేత్తలున్నారు.

ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం.. దేశంలో 2018 సంవత్సరంలో రూ.1,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన సంపన్నులు 831 మంది ఉండగా.. 2019 సంవత్సరంలో వీరి సంఖ్య 953కు పెరిగింది.
అమెరికా డాలర్‌ పరంగా చూస్తే మాత్రం ఈ సంఖ్య 141 నుంచి 138కి తగ్గింది.
ఈ జాబితాలోని టాప్‌ 25 మంది లక్ష్మీపుత్రుల ఉమ్మడి సంపద దేశ జీడీపీలో 10 శాతానికి సమానంగా ఉంది.
953 మంది వాటా 27 శాతంగా ఉంది.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో జాబితాలోని వారందరీ ఉమ్మడి సంపద 2 శాతం మేర పెరిగింది. సగటు సంపద మాత్రం 11 శాతం తగ్గింది.
344 మంది వ్యక్తులు లేదా జాబితాలోని వారిలో మూడోవంతుకన్నా ఎక్కువ మంది సంపద తగ్గింది. దీంతో మరో 112 మంది రూ.1,000 కోట్ల సంపదను చేరుకోలేకపోయారు.
ఐదేళ్లకాలంలో భారత్‌ జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లకాలంలో దేశంలోని సంపన్నుల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని హురన్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ, చీఫ్‌ రీసెర్చర్‌ అనాస్‌ రహమాన్‌ తెలిపారు.
సంపన్ను పారిశ్రామికవేత్తల్లో 246 మంది ముంబైలోని నివాసముంటున్నారు. న్యూఢిల్లీలో 175 మంది, బెంగళూరులో 77 మంది ఉన్నారు.
82 మంది ప్రవాస భారతీయులున్నారు. వీరిలో 76 శాతం మంది స్వయంగా సంపన్నులుగా ఎదిగారు. వీరిలో 31 మంది అమెరికాలో ఉన్నారు. మిగతా వారు యూఏఈ, యూకేలో ఉన్నారు.
25 ఏళ్ల వయసున్న ఓయో రూమ్స్‌ వ్యవస్థాపక సీఈఓ రితేష్‌ అగర్వాల్‌ సంపన్నుల జాబితాలో అత్యంత యువ సంపన్నుడిగా నిలిచారు. ఈయన సంపద రూ.7,500 కోట్లు. 40 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారిలో మీడియా డాట్‌ నెట్‌కు చెందిన దివ్యాంక్‌ తురకియా అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.
జాబితాలో 152 మంది మహిళలు ఉండగా.. వీరి సగటు వయసు 56 ఏళ్లుగా ఉంది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ్‌సకు చెందిన రోష్ణి నాడార్‌ (19వ స్థానం.. 37 ఏళ్లు) అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె సంపద రూ.36,800 కోట్లుగా ఉంది.
జాబితాలోని వారందరి సగటు సంపద రూ.5,300 కోట్లు ఉండగా.. సగటు వయసు 60గా ఉంది.
కర్కాటకం, కన్య, మేషం, సింహం, వృశ్చిక రాశుల వారే సంపన్నుల జాబితాలో అధిక శాతం మంది ఉన్నారు.

Comments

Popular posts from this blog

Indian Government giving tax benefits to few chosen big corporate

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

UN General Assembly (UNGA 73) & (UNGA 74)