Budget - 2020-21 - An Analysis
మాంద్యాన్ని అరికట్టలేని ‘మహాపద్దు’
07-02-2020 02:53:42
కేంద్ర బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను పీడిస్తున్న మాంద్యాన్ని నిర్మూలించేందుకు దోహదపడేలా లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాస్తవాలను కప్పిపుచ్చి అంకెల గారడీకి పాల్పడ్డారు. మోదీ ప్రభుత్వం యథాప్రకారం ఈ బడ్జెట్‌లోనూ కార్పొరేట్ శక్తులకు పెద్ద ఎత్తున రాయితీలను కొనసాగించింది. సమష్టి డిమాండ్, ఉపాధి అవకాశాలు, ప్రజల ఆదాయాలు, వృద్ధి రేటును ఈ బడ్జెట్ మరింత ఛిద్రం చేసి ఆర్ధిక మాంద్యాన్ని మాత్రమే విస్తరింపజేస్తుంది.
కొత్త ఆర్థిక సంవత్సర(2020–21) కేంద్ర బడ్జెట్ రూ.30.42 లక్షల కోట్ల మహా పద్దు. 2019–-20 సవరించిన బడ్జెట్ కంటే రూ.3.42 లక్షల కోట్లు ఎక్కువ. ప్రత్యక్ష పన్నుల ద్వారా 24.23 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ.3.85లక్షల కోట్లు, అప్పుల ద్వారా రూ.8.49 లక్షల కోట్లు, ప్రభుత్వరంగ సంస్థల లాభాల్లో డివిడెండ్స్ ద్వారా రూ.1.55 లక్షల కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు బడ్జెట్‌కి ఆదాయం సమకూరుతుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
మొత్తంగా పన్ను ఆదాయంలో గతంలో కంటే ఈ బడ్జెట్‌లో అదనంగా 12శాతం వృద్ధిని చూపారు. 2019–-20 బడ్జెట్‌లో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితమౌతుందని చూపగా అది 3.5 శాతానికి చేరింది. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటును 3.8 శాతంగా ఉండగలదని పేర్కొన్నారు. సవరించిన 2019-–20 బడ్జెట్‌లో సుమారు 88వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని తెలిపారు. వాస్తవంగా ఈ తగ్గుదల రూ.1.55 లక్షల కోట్లకు పైబడి వుంటుంది. ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో పన్నుల ద్వారా వస్తుందని చూపిన ఆదాయం సాధ్యమయేది కాదు. వివిధ రంగాలకి, పథకాలకి, కార్యక్రమాలకి కోత పెట్టడం అనివార్యం.
ద్రవ్యలోటు తగ్గింపునకు మూడు పద్ధతులను ప్రభుత్వం అనుసరిస్తున్నది. మొదటిది-, మౌలిక వసతులు, సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టే ఖర్చులో కోత. పెరిగిన ఆదాయానికి అనుగుణంగా వీటిపై నిధుల కేటాయింపు పెంచరు. రెండోది,- ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మడంద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం. మూడోది,- ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోకుండా బడా సంస్థలకు, సంపన్నులకు భారీ రాయితీలిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. ఈ పద్ధతుల ద్వారా ద్రవ్యలోటును కుదిస్తున్నారు. దీనివల్ల ప్రజల వినియోగ వ్యయం, సమిష్టి డిమాండ్‌పై తీవ్ర దుష్ప్రభావం కలుగుతున్నది.
ప్రభుత్వరంగ సంస్థల వాటాలు ఉపసంహరణల ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు రాబట్టాలని ప్రతిపాదించారు. గతంలో ప్రతిపాదించిన బిపిసిఎల్, ఎయిర్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ వంటి వాటితో పాటు ఈ బడ్జెట్‌లో ఎల్‌ఐసి, ఐడిబిఐ, ప్రభుత్వ బ్యాంకులు, రైల్వే సర్వీసులు తదితర వాటిని చేర్చటం ముఖ్యమైన మార్పు. దేశంలోని 12 ప్రభుత్వ మేజర్ పోర్టులను కార్పొరేటీకరణ చేయనున్నట్లు చెప్పారు. 150 రైళ్ళను పిపిపి పేర ప్రైవేటీకరించబోతున్నారు. డేటా పార్కులను కూడా కార్పొరేట్‌శక్తుల పరం చేస్తున్నారు.
ఈ చర్యలు దేశ ఆర్ధిక వ్యవస్థకు చాలా నష్టం కలగజేస్తాయి. 2014నుండి మోదీ ప్రభుత్వం సుమారు రూ. 4లక్షల కోట్లు విలువ గల ప్రభుత్వ సంస్థల పెట్టుబడులను ఉపసంహరించింది. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండానే వ్యూహాత్మక భాగస్వామ్యం పేర విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దక్షిణ కొరియా కంపెనీ పోస్కోకి ధారాదత్తం చేయటానికి పూనుకున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ సంస్ధలు కేంద్ర బడ్జెట్‌కి ఈ ఐదేళ్ళలోడివిడెండ్స్ రూపంలో రూ.5.5లక్షల కోట్లుకు పైబడి ఇచ్చాయి. ఈ బడ్జెట్‌లో కూడా రూ.1.55 లక్షల కోట్లు ఈ సంస్థల డివిడెండ్స్ ద్వారా వస్తుందని చూపించారు.
ప్రభుత్వరంగ జీవిత బీమా దిగ్గజమైన ఎల్‌ఐసిలోని ప్రభుత్వ వాటాలను షేర్లరూపంలో స్టాక్ మార్కెట్‌లో విక్రయించాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు రూ.90 వేల కోట్లు ఆదాయం రాబట్టబోతున్నారు.ఈ చర్యవల్ల కుటుంబ పరంగా, సామాజిక పరంగాను ప్రజలకు, ప్రభుత్వానికి, దేశ ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర దెబ్బతగలనున్నది. రూ. 31 లక్షల కోట్లు ఆస్తులు కలిగి ఉన్న ఎల్‌ఐసీ ప్రైవేట్ బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ 74 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 2019 మార్చికి 29 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు దేశ అభివృద్ధికి ఇచ్చింది.
ప్రతి ఏడాది డివిడెండ్స్‌తో పాటు అతితక్కువ వడ్డీతో రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరుస్తున్నది. ఇంత ప్రాధాన్యత కలిగిన సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించటం పెద్ద కుట్రే. కాని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ఎల్‌ఐసి స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం వల్ల స్టాక్ మార్కెట్‌లో టాప్ కంపెనీగా మారుతుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిని బలహీనం చేసి విదేశీ, స్వదేశీ సంస్థలకు లాభాలు దోచిపెట్టడమే అవుతుంది. ఎందుకంటే ఎల్‌ఐసి 2019-–20లో సుమారు రూ. 5.61 లక్షల కోట్లు ఆదాయం నమోదు చేసి, రూ. 53 వేల కోట్లు మిగులు విలువను సాధించింది. ఇంత మార్కెట్‌ను ఎట్లాగైనా కైవసం చేసుకోవాలని కార్పొరేట్ సంస్థలు వత్తిడి చేస్తున్నాయి. ఇదీ అసలు రహస్యం.
నరేంద్ర మోదీ గొప్పగా ప్రకటించిన అనేక పథకాలకు కేటాయించిన నిధు లు దారుణంగా కోతకు గురయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతులకు, ఆదాయ మద్దతుపేర ఏడాదికి రూ.6వేల రూపాయల పథకానికి కేటాయించిన నిధులు భారీగా కోతకు గురయ్యాయి. 2019-–20లో దీనికి రూ.75వేల కోట్లు కేటాయించి సవరించిన బడ్జెట్‌లో రూ.54,370కి తగ్గించారు. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో తిరిగి 75వేల కోట్లు కేటాయించారు. దేశంలోని 10కోట్ల మందికి 5లక్షల ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్‌కి 2019–-20లో రూ.6556 కోట్లు కేటాయించి సవరించిన బడ్జెట్‌లో రూ.3314 కోట్లకి తగ్గించారు. 2020–-21లో కూడా రూ.6429 కోట్లు మాత్రమే కేటాయించారు.
రైతుల పంటల బీమా పథకమైన పిఎం ఫసల్ బీమా యోజన్‌కి రైతులకు చెల్లించాల్సిన రూ.5వేల కోట్లకి నిధుల ప్రస్తావన లేదు. స్వచ్ఛ్ భారత్ పథకానికి రూ.12,294 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అమృత, స్మార్ట్ సిటీల పథకాలను కూడా గత ఏడాది రూ.13,750 కోట్లు కేటాయించి రూ. 9842 కోట్లకు కుదించారు. ఈ ఏడాది రూ.13,750 కోట్లు మాత్రమే కేటాయించారు. ఐసిడిఎస్, జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ విద్యా మిషన్‌ల కేటాయింపులు, ఖర్చులు కూడా ఇదే దారిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రుణభారం గణనీయంగా తగ్గిందని ఆర్ధికమంత్రి గొప్పగా చెప్పారు. 2014 మార్చి నాటికి జీడీపీ 52.2శాతం రుణభారం ఉంటే అది 2019 మార్చికి 48.7 శాతానికి తగ్గిందని అన్నారు.
ఇది మోదీ ప్రభుత్వ ఘన కార్యమన్నారు. ఇది పెద్దమాయ. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖలు, సంస్ధల చేత భారీగా అప్పులు చేయించి వాటిని ప్రభుత్వ రుణ లెక్కల్లో చూపడం లేదు. 2019 మార్చినాటికి ఎఫ్‌సిఐ చేత రూ 2.65 లక్షల కోట్లు అప్పుచేయించారు. ఈ ఏడాది మరో లక్షకోట్లు అప్పుచేపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. జాతీయరహదారుల ప్రాధికార సంస్ధ(ఎన్‌హెచ్‌ఏఐ)ను కూడా ఎఫ్‌సిఐ మాదిరిగా రూ.1.78 లక్షల కోట్లు అప్పుల్లోకి దించింది. అలాగే ఎరువుల సబ్సిడీ చెల్లించడానికి ప్రధాన ఎరువుల కంపెనీలకు బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించారు.
భారతీయ రైల్వే, ఫైనాన్సింగ్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లు కూడా కొత్త ప్రాజెక్టులకు అప్పులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అప్పులను ఆయా కంపెనీల బ్యాలెన్స్ షీట్లలో కనిపిస్తాయి తప్ప బడ్జెట్‌లో వాటి ప్రస్తావన ఉండదు. ఇలాంటి అనైతిక పద్దతుల ద్వారా జీడీపీ లో ద్రవ్యలోటు తగ్గించి చూపించడానికి పాల్పడుతున్నది. 2017–-18 లో ద్రవ్యలోటును 3.4 శాతంగా చూపినా బ్యాలన్స్ షీట్లలో చూపని అప్పులను కలుపుకుంటే ద్రవ్యలోటు 5.86 శాతంగా ఉందని కాగ్ తెలిపింది. కనుక ఈ మోదీ విధానం వల్ల అప్పులు చేసిన సంస్థలు రుణాలు చెల్లించలేక చివరికి ప్రైవేటీకరించబడతాయి.
ఆదాయపన్ను భారం తగ్గుతుందని గంపెడాశతో ఎదురు చూసిన ప్రజలకు ఆర్ధికమంత్రి నిరుత్సాహాన్నే మిగిల్చారు. మూడు శ్లాబులకు బదులు ఏడు శ్లాబులతో కొత్త విధానం తీసుకొచ్చి పాత, కొత్త రెండూ కొనసాగుతాయని చెప్పారు. రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించుకోవాలని మెలికపేచి పెట్టారు. మినహాయింపులు వర్తించవని చెప్పారు. నేడు కేంద్ర బడ్జెట్‌కి 17 శాతం ఆదాయ పన్ను ద్వారా ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపులన్నీ క్రమేణా రద్దు చేయాలనే కుట్రతోటే రెండో ఆదాయపన్ను విధానాన్ని తీసుకొచ్చారు.
డా. బి.గంగారావ్
ఆర్ధిక విశ్లేషకులు

Comments
Post a Comment