14,378 కేసుల్లో 4,291 మర్కజ్‌ లింక్‌

14,378 కేసుల్లో 4,291 మర్కజ్‌ లింక్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: దేశంలోని 14,378 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 4,291(29.8%) తబ్లీగీ జమాత్‌కు సంబంధించినవేనని కేంద్రఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై మర్కజ్‌ ప్రభావం చూపిందన్నారు. తమిళనాడులో 84%, తెలంగాణలో 79%, ఢిల్లీలో 63%, ఏపీలో 61%, యూపీలో 59% కేసులకు తబ్లీగీనే కారణమని వివరించారు. ‘రాపిడ్‌ యాంటీ బాడీ టెస్ట్‌ కిట్‌ల వినియోగంపై రాష్ట్రాలకు మార్గదర్శకాలిచ్చాం. వాటిని హాట్‌స్పాట్‌లలోనే వాడాలి. కేసులు లేని ప్రాంతాల్లో సర్వైలెన్స్‌కు వినియోగించుకోవచ్చు’ అని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 23 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో గత 28 రోజులుగా, 12 రాష్ట్రాల్లోని 22 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా మృతుల సగటు 3.3 శాతమని చెప్పారు. 1,992 మంది (13.85%) వైరస్‌ నుంచి కోలుకున్నారన్నారు. మొత్తం మరణాల్లో 75.3ు మంది 60 ఏళ్లు పైబడినవారని.. 83ు మందికి ఇతర వ్యాధులున్నాయని తెలిపారు.


కేంద్రం లెక్కల ప్రకారం..

కరోనా మృతుల్లో 45 ఏళ్లలోపు వారు 14.4 శాతం

45-60 ఏళ్లలోపు వారు 10.03 శాతం

60 నుంచి 75 ఏళ్ల లోపువారు 33.1 శాతం

75 ఏళ్ల పైబడినవారు 42.2 శాతం

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith