భారత్‌లో చైనా పెట్టుబడులు.. అప్రమత్తమైన ప్రభుత్వం!

భారత్‌లో చైనా పెట్టుబడులు.. అప్రమత్తమైన ప్రభుత్వం!
Apr 18 2020 

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో బారత ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. భారత్‌కు పొరుగున ఉన్న దేశాల్లోని సంస్థలు ఇకపై ప్రభుత్వ అనుమతి పొందాకే భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వాణిజ్య శాఖ డీపీఐఐటీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో చైనా, బాంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మియాన్మార్ దేశాలకు చెందిన సంస్థలన్నీ తొలుత ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. కరోనా కరాణంగా నెమ్మదించిన భారత్ ఆర్థిక వ్యవస్థ ద్వారా విదేశీ సంస్థల లాభపడకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం.. ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ఈ మార్పులు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా చైనాను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చైనా కేంద్ర బ్యాంకు వాటా 1.01 శాతానికి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లోని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ)కు  ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరిక. ఇందుకోసం ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక డిపార్ట్‌మెంట్‌ (డీపీఐఐటీ) ప్రకటించింది. ప్రస్తుత లేదా భవిష్యత్‌ ఎఫ్‌డీఐలకు సంబంధించి దేశీయ కంపెనీల యాజమాన్య హక్కుల బదిలీకి సైతం ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని డీపీఐఐటీ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంలో దేశీయ కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాపారాల లాక్‌డౌన్‌తో ఆదాయం లేక దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాయి. ఇదే అదనుగా చైనా దేశ కంపెనీలు మన సంస్థలను బలవంతంగా టేకోవర్‌ చేయకుండా రక్షణ కంచె వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చై నాతో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, భూటాన్‌, నేపాల్‌, మ యన్మార్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాలు భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాయి. మరిన్ని విషయాలు..

జూ ఇప్పటివరకు పాకిస్తాన్‌ నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు మా త్రమే ఈ ఆంక్షలుండేవి. పాక్‌కు చెందిన వ్యక్తి లేదా కంపెనీ భారత్‌లో కొన్ని రంగాల్లో మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. అదీ ప్రభుత్వ అనుమతితోనే. 

జూ భారత స్టార్టప్‌ల్లో చైనాకు చెందిన టెక్‌ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. దేశంలోని 30 యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే) స్టార్ట్‌పలలో 18 చైనా ఫండింగ్‌ కలిగినవే. డీపీఐఐటీ డేటా ప్రకారం.. 2000 ఏప్రిల్‌ నుంచి 2019 డిసెంబరు వరకు చైనా నుంచి 234 కోట్ల డాలర్ల (రూ. 14,846 కోట్లు)  పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి.

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith