మీ మేలు మరువలేనన్న ట్రంప్... మోదీ స్పందన ఇదీ..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి పిలుపునిచ్చారు. కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో భారత్ తరపున సాధ్యమైనవన్నీ చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) మాత్రల ఎగుమతిపై నిషేధం సడలించడంపై ప్రధాని మోదీకి ట్రంప్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ... ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా బంధం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. కోవిడ్-19పై మానవాళి పోరాటంలో భారత్ సాధ్యమైన ప్రతి సహాయం చేస్తుంది. కలిసికట్టుగా ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి..’’ అని వ్యాఖ్యానించారు.
కాగా అమెరికాకు హెచ్‌సీక్యూ మాత్రల ఎగుమతికి అనుమతించిన ప్రధాని మోదీ ‘‘అద్భుతమైన నాయకుడు’’ అంటూ ట్రంప్ అంతకు ముందు ట్విటర్లో కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత్ చేసిన సాయం ‘‘ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మోదీ చాలా మంచోడు.. స్వరం మార్చిన ట్రంప్..!
న్యూఢిల్లీ: మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్-19 మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటంపై ప్రశంసలు కురిపించారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ 29 మిలియన్లకు పైగా హెచ్‌సీక్యూ డోసులు కొనుగోలు చేశాం. ఇందులో ఎక్కువగా భారత్ నుంచే వచ్చాయి. దీనిపై భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను. ఆయన నిజంగా చాలా మంచివారు. వాస్తవానికి భారత్‌లో కూడా ఇప్పుడు ఇవి చాలా అవసరం కావడంతో.. వాటిని పంపుతారా లేదా అని నేను మోదీని అడిగాను. అయినా మంచి మనసుతో వాటిని పంపుతున్నారు. ఇక్కడ చాలా మందికి ఆ మందులు అవసరం. నేను మంచి వార్తలు మాత్రమే వింటాననీ.. చెడ్డవి విననని మీకు తెలుసు. అంతేకాదు.. మరణానికి కారణమయ్యే విషయాలు నేను అస్సలు వినాలనుకోను. అయితే ఇది అలాంటిది కాదు...’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో కలిసి తాము వ్యాక్సీన్లు తయారు చేసేపనిలో ఉన్నామనీ... వాటిని పరీక్షించాల్సి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మలేరియా ప్రభావిత దేశాల్లో ఇలాంటి సమస్యలు సాధారణమే అయినందున అక్కడ కరోనా ప్రభావం అంతగా పడలేదనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీక్యూ ఎగుమతికి సహకరించకపోతే- భారత్‌పై ప్రతీకారం తప్పదని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే హెచ్‌సీక్యూ, పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా సడలించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న భారత్.. ఆయన వ్యాఖ్యను అంతగా పట్టించుకోలేదు. కాగా తమ దేశానికి భారత్ ఔషధాలు పంపడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో సైతం మోదీకి ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.

Comments
Post a Comment