కరోనా హాట్‌స్పాట్ జిల్లాలపై సీఎం యోగి సంచలన నిర్ణయం

కరోనా హాట్‌స్పాట్ జిల్లాలపై సీఎం యోగి సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన 15 జిల్లాలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఈ జిల్లాలను సంపూర్ణంగా మూసివేయనున్నట్టు ప్రకటించింది. బుధవారం రాత్రి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ జిల్లాల్లోని ప్రజలెవరూ నిత్యవసరాల కోసం కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని వస్తువులు ఇళ్లవద్దకే డోర్‌డెలివరీ చేయనున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మూసివేయనున్న జిల్లాల జాబితాలో లక్నో, నోయిడా, ఘజియాబాద్, సీతాపూర్, కాన్పూర్, ఆగ్రా, ఫిరోజాబాద్, బరేలీ, షమ్లీ, షహారన్పూర్, బులంద్‌షహర్, వారణాసి, మహారాజ్‌గంజ్, బస్తి తదితర జిల్లాలు ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు యోగి ప్రభుత్వం పేర్కొంది. కాగా ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాలకు గానూ ఇప్పటి వరకు 37 జిల్లాల్లో 326 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కరోనా కేసులు నమోదైన 15 జిల్లాలను కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. 

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Invisible hand - Adam Smith

India GDP - World's Ten Big Economies