భారత్ మూడో దశలోకి రాలేదు.. మాదే పొరపాటు: డబ్ల్యూహెచ్ఓ

భారత్ మూడో దశలోకి రాలేదు.. మాదే పొరపాటు: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిలో భారత్ మూడో దశలోకి అడుగు పెట్టిందని ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ తన నివేదికలో పేర్కొంది. అయితే ఆ నివేదిక తప్పని, భారత్ ఇంకా మూడో దశకు చేరుకోలేదని, కేవలం క్లస్టర్ ఆఫ్ కేసెస్(ఒక ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదవడం) దశలోనే ఉందని తాజా నివేదిక ద్వారా తెలిపింది.



కరోనా వ్యాప్తిలో భారత్‌మూడో దశకు చేరుకుందనే విషయాన్ని భారత వైద్య పరిశోధనా విభాగం(ఐసీఎంఆర్)తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా ఖండించాయి. నమోదవుతున్న కేసుల్లో 20 నుంచి 30 శాతం మందికి ఎవరి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందో తెలియకుండా ఉన్నప్పుడు లేదా దానికి కారణమైన వారికి గుర్తించలేనప్పుడు మాత్రమే మూడో దశ ప్రవేశించినట్లని, ఆ దశ ఇంకా దేశంలోకి ప్రవేశించలేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఒకవేళ దేశంలో కరోనా మూడో దశకు చేరుకుంటే దానిని ప్రజల నుంచి దాచడం అసాధ్యమని పేర్కొంది

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Invisible hand - Adam Smith

India GDP - World's Ten Big Economies