2 వేల మంది కుబేరుల చేతిలో 460 కోట్ల మంది సంపద
2 వేల మంది కుబేరుల చేతిలో 460 కోట్ల మంది సంపద * ఆక్స్ఫామ్ తాజా అధ్యయనంలో వెల్లడి * భారత్లోనూ ధనవంతుల వద్ద భారీగా పోగుపడ్డ సంపద ప్రపంచంలోని 460 కోట్ల మంది నిరుపేదలకు చెందిన సంపద దాదాపు 2 వేల మంది శతకోటీశ్వరుల చేతుల్లో చిక్కుకున్నదని ఆక్స్ఫామ్ యూని వర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో త్వరలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయన నివేదికను సోమవారం ఇక్కడ విడుదల చేసింది. 'టైమ్ టు కేర్' పేరుతో విడుదలయిన ఈ నివేదిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న స్త్రీ-పురుష, పేద-ధనిక విభేదాలను ప్రధానంగా ఎత్తి చూపింది. సంపన్నులైన పురుషులు అందలాలెక్కుతున్న ఈ వ్యవస్థలో పని, పనికి తగిన వేతనం లభించక అనేక మంది మహిళలు, యువతులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటు న్నారని ఈ నివేదిక వెల్లడించింది. వీరికి అందని వేతనాల విలువ ప్రపంచవ్యాప్తంగా ఏటా 10.8 లక్షల కోట్ల డాలర్లకు పైగా వుంటుందని, ఇది టెక్నాలజీ పరిశ్రమ విలువకు మూడు రెట్లు అధికమని ఈ నివేదిక వివరించింది. ఇప్పటికీ అధికశాతం ఆర్థిక ప్రయోజ నాలు సంపన్నులకు, అధికశాతం మంది పురుష...
Comments
Post a Comment