ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక

May 7 2020 @ 08:14AMహోంజాతీయం

ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
జెనీవా : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్ ను ఎత్తివేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా హెచ్చరించింది. కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నందున కరోనా ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. జెనీవాలో వర్చువల్ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు కరోనా వైరల్ వ్యాధి వ్యాప్తిని తనిఖీ చేయడానికి తగిన ట్రాకింగ్ వ్యవస్థలు, నిర్బంధ నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. వైరస్ వ్యాప్తి తగ్గితే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను దశలవారీగా సడలించుకోవాలని లేదంటే తిరిగి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ ను త్వరగా ఎత్తివేస్తే కరోనా వైరస్ వ్యాప్తిచెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్దోవ్ కూడా హెచ్చరించారు. జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలు లాక్ డౌన్ ను సడలించడం ప్రారంభించాయని, అమెరికాలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను ఎప్పుడు ఎలా ముగించాలో ప్రభుత్వాలు నిర్ణయించాలని, మహమ్మారి తగ్గిన తర్వాతే ఆంక్షలు సడలించాలని మైక్ ర్యాన్ సూచించారు. సరిగ్గా నెలరోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా 13,46,800 కరోనా కేసులుండగా, మే 6వతేదీ నాటికి కరోనా రోగుల సంఖ్య 37.8 లక్షలకు పెరిగింది. కరోనా వల్ల 2.61 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

Comments

Popular posts from this blog

2 వేల మంది కుబేరుల చేతిలో 460 కోట్ల మంది సంపద

Invisible hand - Adam Smith

India @3 at 2028 Morgan Stanley