Liquor Economics - India
పూటుగా పెంపు
పూటుగా పెంపు
మద్యం షాపులు తెరుచుకోవడంతో పండుగ చేసుకుంటున్న మందుబాబులకు ఒకింత షాక్. దేశంలో మద్యం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో నష్టపోయిన ఆదాయాన్ని కొంతైనా పూడ్చుకోవాలన్న లక్ష్యంతో కొన్ని రాష్ట్రాలు మద్యం ధరలను భారీగా పెంచేశాయి.
మద్యం ధరలను పెంచుతున్న రాష్ట్రాలు
ఢిల్లీలో 70శాతం అదనపు పన్ను
స్పెషల్ కరోనా ఫీజు పేరుతో వడ్డించిన కేజ్రీ
ఉదయం 9 నుంచి 6:30 దాకా షాపులు బార్లా
రెండోరోజూ మద్యం షాపుల వద్ద భారీగా జనం
కొవిడ్ సెస్ విధించే యోచనలో హరియాణ
జైపూర్‌లో కూపన్ల విధానంతో మద్యం అమ్మకాలు
ఛత్తీస్‌గఢ్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికే సరఫరా
ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు.. ఒకసారి 5 లీటర్ల దాకా
రెడ్‌జోన్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలేమిటి?
ఢిల్లీలో పరిస్థితిపై మంత్రి హర్షవర్ధన్ ఆందోళన
బార్లాపై పునరాలోచించాలని కేజ్రీకి సూచన
న్యూఢిల్లీ, రాయ్‌పూర్, కోల్‌కతా మే 5: ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారూ మద్యం రేట్లను భారీగా పెంచింది. ఏకంగా 70 శాతం అదనపు పన్ను విధించింది. ఈ పెంపునకు ‘స్పెషల్ కరోనా ఫీజు’ అని ఓ పేరు పెట్టింది. మంగళవారం నుంచే ఈ అదనపు పన్ను అమల్లోకి వస్తుందని ఆప్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేనా.. ఢిల్లీలో ఇక రోజంతా మద్యం షాపులు తెరిచే ఉంటాయి.
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6:30 దాకా ఢిల్లీ అంతటా లిక్కర్ షాపులు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.ఢిల్లీలో మధ్యం ధరలు భారీగా పెరిగినా మందుబాబులు లైట్‌గా తీసుకుంటున్నారు. ‘మా దగ్గర ధరలు పెరిగితే ఏం? యూపీలోని గుర్‌గ్రాం, నోయి డా, ఘజియాబాద్ నుంచి కావాల్సినంత మద్యాన్ని తెచ్చుకుంటాం. ధరల పెంపు ప్రభావం ఢిల్లీ ప్రజలపై ఉండదు’ అని ఓ వ్యక్తి చెప్పాడు. హరియాణా ప్రభుత్వం కూడా ‘కొవిడ్-19 సెస్’ పేరుతో మ ద్యం రేట్ల పెంపు విషయాన్ని పరిశీలిస్తోంది. కాగా ఢిల్లీలో వరుసగా రెండోరోజూ మద్యం షాపుల వద్ద జనం వందల సంఖ్యలో గుమిగూడారు. భౌతిక దూరం నిబంధనను గాలికొదిలేసి మద్యం కోసం ఎగబడ్డారు. ‘తెల్లవారుజామున 4 గంటల నుంచే ఎదురుచూస్తున్నాను’ అని మద్యం షాపు వద్ద ఓ వ్యక్తి చెప్పా డు. ‘42 రోజులుగా మందు లేదు. ఈ రోజైనా నన్ను కడుపారా తాగనివ్వండి’ అంటూ మరో మద్యం షాపు వద్ద గుంపులోంచి ఓ వ్యక్తి అరిచాడు. ఢిల్లీలో ఏ మద్యం షాపు వద్ద చూసినా జనాల హోరు కనిపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఇంకా రెడ్‌జోన్‌లోనే ఉందని, మద్యం షాపులను తెరవాలన్న నిర్ణయాన్ని సమీక్షించాలని కేజ్రీ సర్కారుకు సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో జనం తాకిడి పెరిగి.. తోపులాటకు దారితీయడంతో మద్యం షాపులను పోలీసులు గంటలోపే మూయించారు.
జైపూర్‌లో మద్యం కూపన్లు
మద్యం షాపుల వద్ద జనాన్ని నియంత్రించేందుకు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూపన్ల విధానాన్ని అమలు చేయనున్నారు. షాపులకు వచ్చే కస్టమర్లకు టైం స్లాట్‌ల ప్రతిపదికగా కూపన్లు ఇస్తారు. ఆ కూపన్లలో ప్రత్యేకంగా సమయాన్ని పొందుపరుస్తారు. ఆ సమయంలోనే సదరు కస్టమర్లు, షాపునకు వెళ్లి మద్యాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మద్యం షాపు యజమానులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విధానం ద్వారా మద్యం షాపుల వద్ద జనం రద్దీని తగ్గించవచ్చునని జైపూర్ ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. సోమవారం మద్యం షాపుల వద్ద తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో జనం పోగవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
కర్ణాటకలో ఇద్దరి హత్య
మద్యం పొంగిపొర్లుతుండటంతో ఆ మత్తులో నేరాలూ జరుగుతున్నాయి. కర్ణాటకలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. మద్యం కొని బెంగళూరులో స్నేహితులు పార్టీ చేసుకుంటుండగా గొడవ జరగడంతో ఒక వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచాడు. బెంగళూరులోని జీవన్ బీమా నగర్‌లో ఓ ఇంట్లో ఇద్దరు మద్యం తాగుతుండగా గొడవ జరిగి హత్యకు దారితీసింది. వ్యక్తిగత కక్షలతో మహిళా ఆరోగ్య కార్యకర్తపై మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడి చేసి గాయపర్చాడు. శిద్లాఘట్ట అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా, దేశవ్యాప్తంగా మద్యం విక్రయా లు రెండు రోజుల్లో 30ు పెరుగుదల నమోదైందని బేవరేజెస్ కంపెనీ తెలిపింది. లాక్‌డౌన్‌తో స్టాకును మద్యం షాపులకు చేరవేయడం సవాల్‌గా మారిందని పేర్కొన్నది.
ఛత్తీ్‌సగఢ్‌లో ఇంటికే మద్యం
ఛత్తీ్‌సగఢ్‌లో బాటిళ్లు కొనేందుకు మద్యం ప్రియు లు షాపుల దాకా వెళ్లాల్సిన పని లేదు. ఆర్డర్ చేస్తే చాలు.. వారి ఇంటికే మద్యం రానుంది. ఈ మేరకు మద్యం అమ్మకాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఈ విధానం వల్ల మద్యం షాపుల వద్ద జనం తగ్గుతారని భావిస్తున్నా రు. ఛత్తీ్‌సగఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ పేరుతో ఈ పోర్టల్ పనిచేస్తుంది. అయితే, ఒకసారి 5 వేల మిల్లీలీటర్ల వరకే పరిమితి ఉంటుంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష బీజేపీ తప్పుబట్టింది. మద్యాన్ని ప్రజల ఇంటికే పంపడం సిగ్గుచేటని విమర్శించింది.
2019-20లో రాష్ట్రాల మద్యం ఆదాయం రూ.1.75 లక్షల కోట్లు
2019-20 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా దేశంలోని రాష్ట్రాల ఖజానాలోకి రూ.1.75 లక్షల కోట్లు చేరాయి. మద్యంపై విధించే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఈ ఆదాయం చేకూరిందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఆ గణాంకాల ప్రకారం.. రాష్ట్రాల మొత్తం పన్ను ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీ వాటా 12.5 శాతంగా ఉంది.
రాష్ట్రాల ఖజానాకు ఎక్సైజ్ దన్ను
(ఆర్‌బీఐ గణాంకాలు - 2019-20 ఆర్థిక సంవత్సరం)
రాష్ట్రం ఎక్సైజ్ రాష్ట్ర మొత్తం
ఆదాయం రెవెన్యూలో
(రూ.కోట్లలో) వాటా(శాతాల్లో)
తెలంగాణ 10,901 15.7
ఆంధ్రప్రదేశ్ 8,518 11.3
తమిళనాడు 7,262 5.8
కర్ణాటక 20,950 20.6
మహారాష్ట్ర 17,477 8.3
ఉత్తరప్రదేశ్ 31,517 21.8
రాజస్థాన్ 10,500 14.2
పశ్చిమ బెంగాల్ 11,873 17.7
మధ్యప్రదేశ్ 13,000 19.9
మొత్తం 1,75,501 12.5

Comments
Post a Comment