స్వదేశీ వస్తువులే కొనండి
స్వదేశీ వస్తువులే కొనండి
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రజలంతా ఇప్పుడు స్థానికత కోసం స్వరం (వోకల్ ఫర్ లోకల్) పెంచాల్సిన అవసరముంది. స్వదేశీ వస్తువులనే కొనాలనే నినాదం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. అసోం నుంచి రజనీ అనే మహిళ నాకు లేఖ రాశారు. లద్దాఖ్‌లో పరిస్థితుల నేపథ్యంలో ఆమె స్థానిక వస్తువులనే కొంటున్నారు.
- ప్రధాని మోదీ
స్థానికత కోసం దేశ ప్రజలు నినదించాలి
దుష్ట దృష్టితో చూస్తే దునుమాడుతాం
మన జవాన్లు ప్రాణాలిచ్చారు తప్ప
శత్రువుకు విజయం ఇవ్వలేదు: మోదీ
చైనా విద్యుత్తు పరికరాల్లో మాల్‌వేర్, ట్రోజన్
కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్
పీవోకేలో చైనా యుద్ధ విమానాలు!
న్యూఢిల్లీ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయులంతా మేడిన్ ఇండియా వస్తువులనే కొనండి. కరోనా లాక్‌డౌన్లతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఈ నిర్ణయం ఊతమిస్తుంది. కరోనా నుంచి మనమంతా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా, అవకాశాలుగా మార్చుకోవడంపై దృష్టిసారించాం. ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేశాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రజలు స్థానికత స్వరం(వోకల్ ఫర్ లోకల్) పెంచాల్సిన అవసరముంది’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఆదివారం నాటి ‘మన్‌కీ బాత్’లో ఆయన కరోనా కట్టడి, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మన సైనికుల తెగువపై మాట్లాడారు. స్వదేశీ వస్తువులనే కొనాలనే నినాదం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోందన్నారు. అసోం నుంచి రజనీ అనే మహిళ తనకు లేఖ రాశారని, చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఆమె స్థానిక వస్తువులే కొంటున్నారని చెప్పారు.
‘‘భారత్ పొరుగుదేశాలతో స్నేహహస్తాన్ని కోరుకుంటుంది. కానీ, దేశం వైపు దుష్ట దృష్టితో చూసేవారిని దునుమాడుతాం. ప్రత్యర్థికి దీటు గా జవాబిస్తాం. లద్దాఖ్‌లో భారత భూభాగంపై కన్నేసిన వారికి మన సైన్యం తగిన గుణపాఠం చెప్పింది. సైనికుల శౌర్యమే భారత్ బలం. దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయబోమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో పోరాడి అసువులుబాసిన 20 మంది వీర సైనికులు రుజువుచేశారు’’ అని మోదీ అన్నారు. అమర సైనికుల కుటుంబాలు తమ పిల్లలను సైన్యంలో పంపేందుకు సిద్ధపడ్డారని ఆయన వివరించారు. బిహార్‌కు చెందిన కుందన్ కుమార్(ఇటీవల లద్దాఖ్‌లో అమరుడయ్యారు) తండ్రి తన మనుమలను సైన్యంలోకి పంపిస్తానని చెప్పారన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎన్నో దేశాలకంటే బలమైన శక్తిగా భారత్ ఉం డేది. అప్పట్లో మనకంటే వెనుకబడిన దేశాలు ఇప్పుడు రక్షణ రంగంలో ముందంజలో ఉన్నా యి. మనం ఆ కోణంపై దృష్టిపెట్టలేదు. గత ఆరేళ్లుగా రక్షణశాఖను బలోపేతం చేస్తున్నాం’’ అని మోదీ వివరించారు.
కరోనా వైపరీత్యం వస్తుందని ఆరేడు నెలల క్రితం ఎవరూ ఊహించలేదని, అప్పటి నుంచీ 2020లో మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పారు. ‘‘చాలా మంది 2020 మంచిది కాదని, అది ఎప్పుడు ముగుస్తుందా? అని చూస్తున్నారు. అది సరికాదు. సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి. కరోనాను సైతం అనుకూలంగా మలచుకుని, ఆత్మ నిర్భర్ భారత్‌ను నిర్మిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పాటించకుంటే మీతో పాటు ఇతరులను, ప్రత్యేకించి మీ కుటుంబాల్లోని పెద్దలు, చిన్నారులను ఇబ్బందులకు గురి చేసినవారవు తారు. దేశ ప్రజలంతా దేశ ఆర్థిక పరిసితిని గాడిలో పెట్టేందుకు సహకరించాలి’’ అని కోరా రు. కరోనా కాలం మన సాంప్రదాయ ఆటలకు ప్రాధాన్యత కల్పించిందని ప్రధాని అన్నారు. తమిళనాడులో పళ్లంగుల్, కర్ణాటకలో అలీగులీ మనే, తెలుగు రాష్ట్రాల్లో వామనగుంటలు(వొనగుంతలు) ఆట సరదా ఆటలైనప్పటికీ వ్యూహాలుంటాయన్నారు. ఈ ఆటలు దక్షిణ భారతం నుంచి ఆగ్నేయ దేశాలకు, ప్రపంచానికీ పాకాయన్నారు. ఇవన్నీ మన బాల్యాన్ని గుర్తుకుతెస్తాయని చెప్పారు.
కరోనాను ప్రజలే కట్టడి చేశారు
భారత్‌లో కరోనాను ప్రజలే కట్టడి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం (ఏఏపీఐ) వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘భారత్‌లో సరైన సమయంలో లాక్‌డౌన్ విధించాం. ప్రజల సహకారంతోనే వైరస్ విస్తృతిని కట్టడి చేశాం. అమెరికాలో ప్రతి 10 లక్షల కేసుల్లో 350, ఐరోపాలో 600 చొప్పున మరణాలు నమోదవ్వగా.. భారత్‌లో ఆ రేటు 12 కంటే తక్కువగా ఉంది. కరోనా తో భారత్‌లో వైద్య వనరులు అభివృద్ధి చెందా యి. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం’’ అని వివరించారు. యోగా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక జీవనశైలిగా మారిందన్నారు. ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని గుర్తుచేశారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ఉధృతమైందన్నారు.
దేశ రక్షణపై మాట్లాడరా?: రాహుల్
ప్రధాని మన్‌కీ బాత్‌లో దేశ రక్షణ, భద్రతపై ఎప్పుడు మాట్లాడతారంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా కూడా లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రధానిపై విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో చైనాను నిలువరించామని, ప్రధాని మోదీ వచ్చాక నేపాల్ కూడా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిందని ఎద్దేవా చేశారు. మోదీ మన్‌కీ బాత్ కాకుండా ‘లద్దాఖ్‌కీ బాత్’ను ఎప్పుడు వినిపిస్తారని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ ప్రశ్నించారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్తు పరికరాల్లో మాల్‌వేర్, ట్రోజన్ హార్స్ ఉన్నాయని గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. దీని వల్ల విద్యుత్తు గ్రిడ్లను చైనా కుప్పకూల్చే ప్రమాదముందన్నారు. దీన్ని నిరోధించేందుకు శక్తిమంతమైన ఫైర్‌వాల్స్‌ను వాడుతామని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా తన యుద్ధ విమానాలను మోహరించింది.
ఘర్షణకు ముందే.. చైనా మార్షల్ ఆర్ట్స్ యోధుల మోహరింపు
గల్వాన్ లోయలో భారత సైన్యంపై చైనా ఇనుపరాడ్లు, రాళ్ల దాడి వ్యూహాత్మకమేనని నిరూపితమైంది. ఈ దాడికి ముందే చైనా పక్కా ప్రణాళికతోనే పర్వతారోహకులు, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ యోధులతో 5 మిలీషియా బృందాలను ఏర్పాటు చేసిందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. జూన్ 15న టిబెట్‌లోని లాసాలో ఈ బృం దాలను మోహరించిందని, చైనా సెంట్రల్ టెలివిజన్ కూడా పేర్కొన్నది.

Comments
Post a Comment