Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..? ‘‘వనాటు.. ఆస్ట్రేలియా దగ్గర్లో ఉండే ఈ దేశ ప్రభుత్వానికి కోటిన్నర రూపాయలు డొనేషన్ ఇచ్చేస్తే ఆ దేశ సిటిజన్‌షిప్ ఇచ్చేస్తారు. డ్యూయల్ సిటిజన్ షిప్ ప్రోగ్రామ్స్‌లో ఇదే చాలా ఫాస్టెస్ట్. 45 రోజుల్లోనే పౌరసత్వం ఇచ్చేస్తారు. మాల్టా, మాంటెనీగ్రో, సెయింట్ లూషియా, గ్రెనడా.. ఇలా ప్రపంచంలోని చాలా దేశాలు ఇతర దేశ పౌరులకు డ్యూయల్ సిటిజన్ షిప్ కింద తమ దేశ పౌరసత్వం ఇస్తుంటాయి. ఆయా దేశాల్లో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడమో, లేక సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడమో చేస్తే చాలు. ఏదైనా కంపెనీ పెట్టి ఆ దేశ పౌరుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా కొన్ని దేశాల్లో పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక స్కీములున్నాయి. ఇలా ద్వంద్వ పౌరసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న పౌరులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. కానీ, భారత్ మాత్రం ఈ ద్వంద్వ పౌరసత్వానికి ఒప్పుకోదు. ఇదే ఇక్కడ ట్విస్ట్’’.. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా? తెలుగు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తన యూట్యూబ్ చానెల్లో ’డ్యూయల్ సిటిజన్‌షిప్’ పేరిట ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు....
Comments
Post a Comment