Women bootleggers in Andhrapradesh
కృష్ణా, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లలో మహిళలు మద్యం అక్రమ రవాణా
మద్యం రాకెట్‌కు రైల్వే నిఘా సంస్థల సహకారం
పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్
ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చినా బుట్టదాఖలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి: అక్రమ రవాణాకు రైళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న బిల్లులు లేని ఉత్పత్తులు, నిన్నటికి నిన్న గుట్కా ప్యాకెట్లు, నేడు ఏకంగా మద్యం బాటిళ్లనే తరలించేస్తున్నారు. ఈ చీకటి వ్యవహారాలపై రైల్వే ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు రైల్వేశాఖకు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, జీఆర్‌ఈ, ఆర్పీఎఫ్‌లకు నివేదిస్తున్నా పట్టించుకోవట్లేదు. సంబంధిత శాఖల లాలూచీతోనే ఈ కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ నుంచి రెండు రైళ్లలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోకపోవటం అనుమానాలకు తావిస్తోంది.
ఆ రెండు రైళ్లే టార్గెట్
‘తెలంగాణ నుంచి బెజవాడకు రైళ్లలో అక్రమంగా మద్యం తరలివస్తోంది.’ దక్షి ణ మధ్య రైల్వే జీఎం, బెజవాడ డివిజన్ అధికారులతో పాటు నిఘా సంస్థలకు రైల్వే ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం ఇది. కృష్ణా ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని ఈవిధంగా చేస్తున్నారని తెలిసింది. ఈ రెండు రైళ్లలో మాన్సియన్ హౌస్ బ్రాండ్ మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున తరలుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చినా రైల్వే అధికారులు స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణాలో ఈ బ్రాండ్ క్వార్టర్ రూ.150 ఉంటుంది. ఇది మన రాష్ట్రంలో గతంలో ఉండేది. ప్రస్తుతం మనకు కొత్తరకం బ్రాండ్లు వస్తున్నాయి. పైగా ఇక్కడ క్వార్టర్ రూ.250 నుంచి రూ.300 ఉంటుంది. పై బ్రాండ్లకు డిమాండ్‌ను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు మద్యం మాఫియా తెలంగాణ నుంచి అక్రమ తరలింపునకు పాల్పడుతోంది.
గుట్టుచప్పుడుగా..
రోడ్డు మార్గంలో అయితే దారి పొడవునా తనిఖీలు ఉంటాయి. రైళ్లలో అయితే ఆ పరిస్థితి ఉండదని గమనించిన మద్యం మాఫియా కృష్ణా, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లను టార్గెట్ చేసుకుంది. ఒకటి మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం విజయవాడ వస్తాయి. ఈ రెండు రైళ్లు శాటిలైట్ స్టేషన్లలో ఆగుతాయి. కొండపల్లి, రాయనపాడు శాటిలైట్ స్టేషన్లలో ఆగటం వల్ల ఇక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని తరలించే అవకాశం ఉంటుంది. అలాగే, సిగ్నల్స్ ఇచ్చే క్రమంలో చాలా రైళ్లు విజయవాడకు దూరంగా సరిహద్దుల్లో ఆగుతాయి. ఇలాంటపుడు సరుకును దించుకోవచ్చు. ఔటర్‌లో రైలు నిలిచే పరిస్థితి ఉంటుందా, లేదా అన్నది మద్యం మాఫియా చూస్తుంటుంది. రైలు ఔటర్‌లో ఆగే పరిస్థితి లేకపోతే చైన్ లాగేసి సరుకును దించేస్తారు.
మహిళలే పాత్రధారులు
మద్యం రాకెట్ పనులకు మహిళలే పాత్రధారులుగా ఉన్నారు. మహిళలైతే అనుమానం రాదన్న ఉదే ్దశంతో వారిని రంగంలోకి దింపుతున్నారు. అలాగే, రైళ్లలో చిరుతిళ్లు అమ్ముకునేవారు, యాచకులను కూడా ఇందుకు ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రైల్వే నిఘా సంస్థలు ఎందుకు స్పందించటం లేదన్నది అర్థంకాని ప్రశ్న. రైల్వేలో నిఘా, రక్షణదళ సంస్థలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, ఆర్‌జీపీ, ఆర్‌పీఎఫ్‌లు ఉన్నాయి. వీరు కళ్లు తెరిస్తే తప్ప మద్యం మాఫియాను అడ్డుకునే పరిస్థితి ఉండదు.
The bootlegging era came to an end because the Twenty-first Amendment to the U.S. Constitution, which repealed Prohibition, effectively defined bootlegging out of existence. In other words, the illegal activities that had constituted bootlegging were, by that amendment, no longer illegal.
Twenty-first Amendment, amendment (1933) to the Constitution of the United States that officially repealed federal prohibition, which had been enacted through the Eighteenth Amendment, adopted in 1919.
In dry Rishikesh, women bootleggers under lens
Hindustan Times | By Neha Pant
UPDATED ON DEC 09, 2017 08:45 PM IST
DEHRADUN: Women are the unlikely suspects when it comes to anything illegal related to booze in Uttarakhand as they spearhead protests against liquor shops and alcoholism. But, two women ‘gangs’ are under the police scanner for bootlegging in the spiritual town of Rishikesh.
Popular among pilgrims and adventure tourism lovers, Rishikesh is a ‘dry area’ where consumption or sale of liquor is prohibited. It apparently doesn’t stop ‘desi daru’ lovers from their quota of ‘pawwas’ (one ‘pawwa’ is 180 ml), thanks to bootleggers, many of whom are women.
After clamping down with the Gangster Act, the Rishikesh police is working to nab members of the ‘Janki Gang’ and the ‘Bala Gang’ who are smuggling ‘desi daru’ (country made liquor) in the region. The Act stipulates a minimum of two-year jail and it may extend up to 10 years.
The police have identified and booked two members each of these two gangs under the stringent act after approval from the district magistrate. Many women groups are believed to be involved in smuggling of liquor in the holy town located at the foothills of the Garhwal Himalayas.
Comments
Post a Comment