Bank Charges increased
నేటి నుంచి చార్జీల బాదుడు
Jul 1 2021
న్యూఢిల్లీ : వివిధ బ్యాంకుల వినియోగదారులు, సగటు ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే కొన్ని మార్పులు జూలై ఒకటో తేదీ నుంచి (గురువారం) అమలులోకి రానున్నాయి. .
ఎస్‌బీఐ ఏటిఎం చార్జీల సవరణ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. ఏటీఎంల నుంచి ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును నెలకి నాలుగుకే పరిమితం చేయనుంది. ఆ పైబడిన నగదు విత్‌డ్రాయల్స్‌పై ఒక్కో దానికి 15 రూపాయలు+జీఎస్‌టీ చెల్లించుకోక తప్పదు. చెక్‌బుక్ వినియోగాన్ని కూడా పరిమితం చేసింది. ఏడాదికి 10 చెక్ లీవ్స్‌ను మాత్రమే అందించబోతోంది. అది దాటితే ప్రతీ కొత్త చెక్‌బుక్ పైన అదనపు భారం మోయక తప్పదు.
ఐడీబీఐ బ్యాంకు : ఐడీబీఐ బ్యాంకు కూడా చెక్‌బుక్, సేవింగ్స్ ఖాతాలు, లాకర్ చార్జీలు పెంచుతోంది. 20 పేజీల చెక్‌బుక్ ఉచితంగా అందిస్తుంది. ఆ పైబడిన ప్రతీ చెక్కు పైన రూ.5 వసూలు చేస్తుంది. సబ్ కా సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఇవి వర్తించవు.
సిండికేట్ బ్యాంక్ ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మార్పు : సిండికేట్ బ్యాంక్‌లో కెనరాబ్యాంక్ విలీనం అయిన నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మారనున్నాయి. ప్రతీ ఒక్క ఖాతాదారుడు తమ బ్రాంచి కొత్త ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ తెలుసుకోవలసిందిగా సూచించింది.
కొత్త చెక్‌బుక్‌లు: ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు రెండూ యూనియన్ బ్యాంకులో విలీనం అయినందు వల్ల ఆ రెండు బ్యాంకుల చెక్‌బుక్‌లు రద్దు కానున్నాయి. ఆ బ్యాంకుల ఖాతాదారులు తమ బ్రాంచిలకు వెళ్లి కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని సూచించారు.
ఐటీ రిటర్న్ దాఖలు చేయని వారిపై అదనపు టీడీఎస్ : గత రెండు సంవత్సరాల కాలానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయని వారికి అదనపు టీడీఎస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక టీడీఎస్ రూ.50 వేలు దాటిన ఖాతాదారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది
Comments
Post a Comment