Gautam Adani: భారత్ అసాధారణ ప్రయాణం వెనుక మన్మోహన్, మోదీ... గౌతమ్ అదానీ ప్రశంసల జల్లు
Gautam Adani: భారత్ అసాధారణ ప్రయాణం వెనుక మన్మోహన్, మోదీ... గౌతమ్ అదానీ ప్రశంసల జల్లు
ABN , Publish Date - Jun 19 , 2024 | 07:01 PM
ఇండియా 'అసాధారణ ప్రయాణం' వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 'హ్యాట్రిక్' ప్రధాని నరేంద్ర మోదీ గణనీయమైన కృషి చేశారని భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ కొనియాడారు.
Gautam Adani: భారత్ అసాధారణ ప్రయాణం వెనుక మన్మోహన్, మోదీ... గౌతమ్ అదానీ ప్రశంసల జల్లు
ముంబై: ఇండియా 'అసాధారణ ప్రయాణం' వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh), 'హ్యాట్రిక్' ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గణనీయమైన కృషి చేశారని భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) కొనియాడారు. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సరళీకరణ విధానం (Liberalisation policy) ప్రకటించంతో ఇండియా 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ' మొదలైందని, అది గత దశాబ్దంలో 'టేకాప్' అయిందని చెప్పారు. ముంబైలో జరిగిన సీఆర్ఐఎస్ఐఎల్ (CRISIL) కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ, భారత్ ఆసాధారణ ప్రయాణంలో 1991 నుంచి 2014 వరకూ 'రన్‌వే' నిర్మాణానికి గట్టి ఫౌండేషన్ పడిందని, 2014 నుంచి 2024 వరకూ విమానం దూసుకెళ్లిందని (take off) అన్నారు.
మన్మోహన్ సింగ్ అప్పటి వరకూ ఉన్న 'లైసెన్స్ రాజ్' విధానానికి తెరదించి ఆర్థిక సరళీకరణ విధానాన్ని తీసుకువచ్చారని, గత విధానంలో వ్యాపారులు పెట్టాలంటే ఎన్నో అనుమతులు అవసరమయ్యేవని, పెట్టుబడులు పెట్టాలన్నా, ధరలు నిర్ణయం విషయంలోనూ ఆంక్షలు ఉండేవని, సరళీకరణ విధానంతో ఆ అవరోధాలు తొలగాయని చెప్పారు. గత దశాబ్ద కాలంలో మౌలిక వసతుల కల్పనారంగంలో గణనీయమైన ప్రగతి సాధించామని అన్నారు. క్వాలిటీ ఆఫ్ గవర్నర్ ఇందుకు ఎంతో దోహదపడిందని, దేశ ముఖచిత్రమే మారిపోయిందని చెప్పారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)పై మాట్లాడుతూ, పబ్లిక్, ప్రైవేటు రంగం పెట్టుబడుల రెండిటి పార్టిసిపేషన్ ఇందులో కీలకమన్నారు. 2020-25కు ప్రాజెక్టెడ్ ఇన్వెస్టెమెంట్ రూ.111 లక్షల కోట్ల పైమాటేనని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎనర్జీ, లాజిస్టిక్స్, వాటర్, విమానాశ్రయాలు, సోషనల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ వంటి 9,000 ఇన్‌ఫ్రాస్ట్చకర్చర్ ప్రాజెక్టులు కార్యరూపంలోకి వస్తాయన్నారు. ఎనర్జీ ట్రాన్సిషన్ స్పేస్‌లో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే యోచనలో ఉందని గౌతమ్ అదానీ తెలిపారు. ఇండియా ఆర్థిక వృద్ధిలో గ్రీన్ ఎనర్జీ కీలక పాత్ర వహించనున్నట్టు చెప్పారు. కచ్ జిల్లాలో ఇప్పటికే తాము పునరుత్పత్తి ఇంధన పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Post a Comment