Posts

అట్రిషన్

Image
  Tcs, Wipro, Infosys: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు! Jan 13, 2022, 13:14 IST మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశాభంగం...రండి బాబు రండి..మా ఆఫీస్ లో జాయిన్‌ అవ్వండి. మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదూ కూడదూ అంటే అంతకు మించి ఇస్తాం' అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి.  ► కోవిడ్‌ కారణంగా ఆయా టెక్‌ దిగ్గజాల్లో అట్రిషన్ రేటు (ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగికి అంతే కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తూ మరో సంస్థ ఆహ్వానించడం) విపరీతంగా కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్‌ నెల క్యూ4 ముగిసే సమయానికి  టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో'  కంపెనీల్లో అట్రిషన్‌ రేటు గడిచిన 3ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క డిసెంబర్‌ నెలలో ఈ మూడు కంపెనీలు మొత్తం 51వేల మందిని నియమించుకున్నాయి.  ► మిగిలిన టెక్‌ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్‌లో అట్రిషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటీవల ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఒక్క ఇన్ఫోసిస్‌లో అట్రిషన్‌ రేటు 25.5శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రోలో అట్రిష...

ఆర్థిక అసమానతలే అసలు సవాళ్లు

  Jan 4 2022 @ 00:21AMహోంఎడిటోరియల్భరతవాక్యం ఆర్థిక అసమానతలే అసలు సవాళ్లు వస్తుసేవల పన్ను వసూళ్లు నెల నెలా పెరుగుతున్నాయి. షేర్ మార్కెట్ పుంజుకుంటోంది. రూపాయి విలువ స్థిరంగా ఉంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ వెలుగొందుతోంది. శీఘ్ర అభివృద్ధి సాధనలో భారత ఆర్థికవ్యవస్థే అగ్రగామిగా ఉందని కూడా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు గుర్తించాయి. అయినా నిరుద్యోగిత దేశం ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్ట సమస్యలలో ఒకటిగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ సమస్య మూలాలు నీతిఆయోగ్‌ ఆలోచనాసరళిలో ఉన్నాయి. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని జాతి భావి ప్రస్థానం విషయమై నీతిఆయోగ్‌ 2018లో ఒక దార్శనిక పత్రాన్ని ప్రకటించింది. అది దేశం ముందు రెండు లక్ష్యాలను ఉంచింది. అవి: శ్రమసాంద్ర ఉత్పత్తిని పెంపొందించడం, శ్రమశక్తి క్రమబద్ధీకరణను ప్రోత్సహించడం.  శ్రమశక్తి క్రమబద్ధీకరణ ఏమిటి? వీధి మొగదలల్లో మోమో (రొట్టెల పిండితో మాంసం, చేపలు లేదా కూరగాయలను కలిపి తయారు చేసే నేపాలీ, టిబెటన్ లేదా ఉత్తర భారతీయ వంటకాలు) విక్రయదారులనే తీసుకోండి. వారు స్వయం ఉపాధిపరులు. తమ శ్రమశక్తిపై ఆధారపడి బతుకు...

Economic crisis in Visakhapatnam

రాష్ట్ర ఆర్థిక రాజధానిలో ఆర్థిక కష్టాలు కరోనా రెండో వేవ్‌, కర్ఫ్యూ ఎఫెక్ట్‌  విశాఖలో 2 నెలలుగా సాగని బిజినెస్‌  3 నెలలుగా అద్దె చెల్లించని వ్యాపారులు  ఉపాధి లేక వీధిన పడ్డ ఉద్యోగులు అద్దెలు రాక యజమానులు సతమతం మరోవైపు ప్రభుత్వం ఆస్తిపన్ను బాదుడు రెండు నెలలుగా వ్యాపారాలు లేవు.. అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి.. వ్యాపారులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఉపాధి లేకపోవడంతో ఉద్యోగులు వీధిన పడ్డారు. 3 నెలలుగా అద్దెలు రాకపోవడంతో యజమానులు ఆస్తిపన్ను కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ఇలా అందరిదీ ఒకటే కష్టం. ఆర్థిక సమస్యలు. కరోనా రెండో వేవ్‌, కర్ఫ్యూ ఆంక్షల వల్ల రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.  (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో వాణిజ్యం వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించడం.. కర్ఫ్యూ విధించడంతో మే, జూన్‌ రెండు నెలలూ వ్యాపారాలు సాగలేదు. కర్ఫ్యూ ఆంక్షలతో రోజుకు నాలుగైదు గంటలే షాపులు తెరిచి, తర్వాత మూసేయాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా కరోనా భయంతో షాపింగ్‌ మాల్స్‌కు రావడం లేదు. దీంతో వ్యాపారాలు కేవలం 10 నుంచి 20...

Failed to control black-money

 కొల్లబోయిన నల్లధన నిర్మూలన పక్కా ప్రణాళికతోనే సత్ఫలితాలు పెద్దనోట్ల రద్దు, డిజిటల్‌ లావాదేవీల ద్వారా నల్లధనానికి ముకుతాడు వేయొచ్చనికేంద్ర ప్రభుత్వం గతంలో ఘనంగా ప్రకటించింది. కానీ, ఆచరణలో అది నీరుగారిపోయింది. ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు అందకుండా, నగదు చలామణీ తగ్గకుండా, డిజిటల్‌ లావాదేవీలు పెరగకుండా నల్లధన నిర్మూలన సాధ్యమయ్యే పని కాదు. 2011లో మన దేశ జనాభాలోని వయోజనుల్లో 35 శాతం మంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉండగా, 2014లో ఆ సంఖ్య 53 శాతానికి, 2017లో గణనీయంగా 80 శాతానికి పెరిగింది. అయినా నేటికీ బ్యాంకు ఖాతాలు లేని 19 కోట్ల వయోజనులతో మన దేశం చైనా (22.4 కోట్లు) తరవాత రెండో స్థానంలో ఉంది.  2017-18తో పోల్చితే 2019-20 నాటికి డిజిటల్‌ లావాదేవీలు ఆశాజనకంగానే పెరిగాయి. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో దేశంలో మొత్తం కరెన్సీ రూ.17.54 లక్షల కోట్లు ఉండగా, 2021 మార్చి నాటికి రూ.28.27 లక్షల కోట్లకు పెరిగింది. 2015-16లో పెద్దనోట్ల రద్దుకు మునుపు కరెన్సీలో వాటి వాటా 86.4 శాతం ఉండగా, 2016-17లో 73.4 శాతానికి తగ్గింది. మళ్ళీ 2020-21 నాటికి 85.7 శాతానికి పెరిగింది. పెద్దనోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీల...

RBI Circular on Cryptocurrency Clarifies No Ban in India: Will UPI, Online Payments Return?

Image
  “Our finance minister herself has called for a “calibrated approach” to cryptocurrencies in India, and given that we have over 1.5 crore crypto users in the country contributing over $2 billion to our economy, it is unlikely that cryptocurrencies will be banned in India,” Shetty told News18. 01-Jun-2021 RBI Circular on Cryptocurrency Clarifies No Ban in India: Will UPI, Online Payments Return? File photo of a Bitcoin illustration. The RBI on Monday clarified that banks must stop using its 2018 directive to prevent crypto investments in India. (Image: AFP)File photo of a Bitcoin illustration. The RBI on Monday clarified that banks must stop using its 2018 directive to prevent crypto investments in India. (Image: AFP) The top Indian regulatory bank issued a statement that its 2018 circular advising against cryptocurrencies is no longer valid, but the road back to banks supporting crypto investments in India may not be as clear. NEWS...

No Free Rice for Corona

 Jul 2 2021   ఉచితంగా ఇవ్వలేం రెగ్యులర్‌ కోటాకు ఇక డబ్బు వసూలు.. ఉచితంగా ఇస్తే 5 నెలలకు 100 కోట్ల భారం మొత్తం 2,100 కోట్లు భరిస్తున్నామన్న ప్రభుత్వం.. వంద కోట్లపై వెనకడుగు నేటి నుంచి రేషన్‌ పంపిణీ.. 15 నుంచి ఉచితంగా కేంద్రం కోటా బియ్యం ఇవి డోర్‌ డెలివరీ.. అవి రేషన్‌ షాపులో తీసుకోవాలి (అమరావతి-ఆంధ్రజ్యోతి) కేంద్రం తన కోటా బియ్యాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించగా, రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌ బియ్యం ఉచితంగా ఇవ్వడం తమవల్ల కాదని జగన్‌ ప్రభుత్వం తేల్చేసింది. కిలోకు రూపాయి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈనెల నుంచే రేషన్‌కు డబ్బులు తీసుకోనుంది. ఇప్పటికే ఉచితం వల్ల రాష్ట్రంపై రూ.2,100 కోట్ల భారం పడుతోందని చెబుతున్న ప్రభుత్వం, రానున్న ఐదు నెలలు కూడా ఉచితంగా ఇస్తే అయ్యే మరో రూ.100 కోట్ల భారం విషయంలో వెనకడుగు వేసింది. శుక్రవారం నుంచి మొదలు కానున్న రెగ్యులర్‌ కోటా రేషన్‌ పంపిణీలో కార్డుదారుల నుంచి బియ్యానికి నగదు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్‌ కోటా పంపిణీ ముగిశాక, ఈనెల 15 నుంచి కేంద్రం ఇచ్చే పీఎంజీకేవై కోటా బియ్యాన్ని డోర్‌ డెలివరీలో కాకుండా రేషన్‌ షాపుల్లో క...

Education and Teachers

 ప్రైమరీ విద్యలో టీచర్లు లేరు అన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50 9, 10 తరగతుల్లో డ్రాపౌట్లు 14.8ు యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదికలో వెల్లడి  న్యూఢిల్లీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్యలో ఉపాధ్యాయులే లేరని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి 2019-20 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన యునైటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌(యూడీఐఎ్‌సఈ+) నివేదికను కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ నిశాంక్‌ గురువారం విడుదల చేశారు. 2019-20 నాటికి ఏపీలో 63,824 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రాథమిక పాఠశాలలు 39,388, ప్రాథమికోన్నత పాఠశాలలు 9,282, సెకండరీ పాఠశాలలు 12,353, ఉన్నత పాఠశాలలు 2,802 ఉన్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) ప్రాథమిక పాఠశాల్లో 24.4, ప్రాథమికోన్నత పాఠశాలలో 16.8, సెకండరీ విద్యలో 15.9, ఉన్నత విద్యలో 39.8 వంతున ఉన్నట్లు పేర్కొన్నారు. పాఠశాల విద్యారంగంలో 3,17,430 మంది ఉపాద్యాయులు ఉండగా, వీరిలో 1,59,302 మంది పురుషులు, 1,58,128 మంది మహిళ...