Economic crisis in Visakhapatnam
రాష్ట్ర ఆర్థిక రాజధానిలో ఆర్థిక కష్టాలు కరోనా రెండో వేవ్, కర్ఫ్యూ ఎఫెక్ట్ విశాఖలో 2 నెలలుగా సాగని బిజినెస్ 3 నెలలుగా అద్దె చెల్లించని వ్యాపారులు ఉపాధి లేక వీధిన పడ్డ ఉద్యోగులు అద్దెలు రాక యజమానులు సతమతం మరోవైపు ప్రభుత్వం ఆస్తిపన్ను బాదుడు రెండు నెలలుగా వ్యాపారాలు లేవు.. అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి.. వ్యాపారులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఉపాధి లేకపోవడంతో ఉద్యోగులు వీధిన పడ్డారు. 3 నెలలుగా అద్దెలు రాకపోవడంతో యజమానులు ఆస్తిపన్ను కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ఇలా అందరిదీ ఒకటే కష్టం. ఆర్థిక సమస్యలు. కరోనా రెండో వేవ్, కర్ఫ్యూ ఆంక్షల వల్ల రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో వాణిజ్యం వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించడం.. కర్ఫ్యూ విధించడంతో మే, జూన్ రెండు నెలలూ వ్యాపారాలు సాగలేదు. కర్ఫ్యూ ఆంక్షలతో రోజుకు నాలుగైదు గంటలే షాపులు తెరిచి, తర్వాత మూసేయాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా కరోనా భయంతో షాపింగ్ మాల్స్‌కు రావడం లేదు. దీంతో వ్యాపారాలు కేవలం 10 నుంచి 20...